Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతీకారం తీర్చుకొంటాం: జంటహత్యలకు పాల్పడిన వారిని వదలం: గంగుల ప్రభాకర్ రెడ్డి

కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పగలు బుసకొట్టాయి. శిరివెళ్ళ మాజీ ఎంపిపి ఇందూరు ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిదిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.అయితే ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకొంటామని వైసీపీ నేత

కర్నూల్: కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పగలు బుసకొట్టాయి. శిరివెళ్ళ మాజీ ఎంపిపి ఇందూరు ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిదిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.అయితే ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకొంటామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పల్లెలు ఇంతకాలంపాటు ప్రశాంతంగా ఉన్నాయి.అయితే ఈ జంట హత్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

we will revenge for double murders of Govindapally: MLC Gangula prabhakhar Reddy

అయితే ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డిని రెండురోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాల వద్ద సిపిఐఎంఎల్ పేరుతో లెటర్ వదిలివెళ్ళారు. తప్పు చేసినవారికి శిక్షతప్పదని ఆ లేఖలో రాశారు.

ప్రశాంతంగా ఉన్న గోవిందుపల్లెలో ఈ జంట హత్యలు కలకలంరేపాయి. ఈ హత్యలకు గల కారణాలను తెలుసుకొనేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ గ్రామాన్ని జిల్లా ఎస్ పి రవికృష్ణ సందర్శించారు.

సంఘటనస్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో వైపు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మృతదేహాలను ఎమ్మెల్సీ , వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి చూశారు.

అయితే ఈ హత్యలకు కారణాలు ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.అంతేకాదు ఈ హత్యలకు కారకులైనవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+