అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా ఇవ్వాల్సిందే, అండగా మేముంటాం: అమరావతిలో కవిత

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత అన్నారు. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత అన్నారు. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు.

అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది: కవిత అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది: కవిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మీడియా ప్రతినిధులు ఎంపీ కవిత అభిప్రాయాన్ని కోరారు. దీనిపై ఆమె స్పందించిన కవిత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఏపీకి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఏపీకి రావడంపై మాట్లాడుతూ.. వేరే రాష్ట్రం వచ్చామని భావన తప్ప మరేం లేదని కవిత అన్నారు. మహిళా సాధికారత అనేది ఈజీ అంశం కాదని అన్నారు. ఇలాంటి వేదికలు అందుకు దోహదం చేస్తాయని అన్నారు. కేంద్రం అనేక సంస్కరణలను తీసుకొస్తుందని చెప్పిన ఆమె.. మహిళల రిజర్వేషన్ల అంశంపై కూడా స్పందిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.

భర్త చాటుగా ఉండి మహిళా ఎంపీటీసీ, జడ్పీలు జరుపుతున్న వ్యవహారాలున్నాయని.. కానీ, చదువుకున్నవారు అలా చేయడం లేదని, మార్పు ఒక్కరోజులో సాధ్యం కాదని అన్నారు.
తెలంగాణలో మార్కెట్ కమిటీలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు.

We will support: kalvakuntla kavitha on Andhra Pradesh special status

మహిళలను గౌరవిస్తేనే మంచి జరుగుతుంది: దలైలామా

మహిళలను గౌరవించడమే అన్ని విధాలా శ్రేయస్కరమని బౌద్ధ మత గురువు దలైలామా పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొన్న ఆయనమాట్లాడుతూ.. విద్యతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలన్నారు.

అంతా సమానం అనే భావన చిన్నతనం నుంచే నేర్పాలని దలైలామా సూచించారు. మహిళలను గౌరవిస్తేనే మనకు మంచి జరుగుతుందని అన్నారు. మహిళలు శారీరకంగా సున్నితమైనా, మానసికంగా బలమైన వారని, వారు అన్ని రంగాల్లో వ‌ృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

English summary
MP Kalvakuntla Kavitha on Friday responded on Andhra Pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X