మోడీకే మద్దతు, డబ్బు వల్లే: జెపి, కెసిఆర్‌పై పొన్నాల
హైదరాబాద్: జాతీయస్థాయిలో తాము మోడీ నాయకత్వాన్నే బలపరుస్తామని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ గురువారం చెప్పారు. తమ మద్దతు ఎన్డీయేకే ఉంటుందన్నారు. మల్కాజిగిరి నుండి తాను గెలుస్తాననే నమ్మకం ుందన్నారు. డబ్బు రాజకీయం వల్లనే పొత్తు కుదరలేదని చెప్పారు.
కెసిఆర్ పైన పొన్నాల మండిపాటు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గురువారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరులకు వారి కుటుంబ సభ్యులు పోటీ చేసే చోట టిక్కెట్లు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. 16న సోనియా కరీంనగర్ జిల్లా సభలో పాల్గొంటారన్నారు.

అన్ని పార్టీలు బిసిలను మోసం చేశాయన్నారు. బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించింది తామే అన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుస్తుంది కాబట్టే టిక్కెట్ల కోసం పోటా పోటీ నెలకొందన్నారు. టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చెప్పారు. రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. సిపిఐకి మద్దతిచ్చిన చోట తాము అభ్యర్థులను ఉపసంహరిస్తామన్నారు.
విమానాశ్రయం: జైరాం
అదిలాబాదు జిల్లాలో విమానాశ్రయం నిర్మిస్తామని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గురువారం చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ హ యాంలోనే బిసిలకు న్యాయం జరిగిందన్నారు. బిసిలకు
ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తాము 32 టిక్కెట్లు కేటాయించామన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రాణహిత - చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. తెలంగాణ విషయంలో బిజెపిది ద్వంద్వ వైఖరి అన్నారు. నిబందనలు ధిక్కరిస్తే రెబల్స్ పైన చర్చలు తీసుకుంటామన్నారు.
తమ్ముళ్ల వీరంగం
గుంటూరు జిల్లాలోని టిడిపి కార్యాలయంలో తెలుగు యువత కార్యకర్తలు గురువారం ఉదయం వీరంగం సృష్టించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మల్లికి అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ వారు నినాదాలు చేశారు. కార్యాలయంలోని కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. తెలుగు యువత కార్యకర్తలో ముఖ్యులు ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది












Click it and Unblock the Notifications