తప్పుడు వదంతులు సృష్టిస్తే కఠిన శిక్షలు, ఆ నిందితుల అరెస్ట్: డీజీపీ
అమరావతి: సోషల్ మీడియాలో పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వదంతులను నమ్మకూడదని ఏపీ డీజీపీ మాలకొండయ్య ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ఆధారంగా అమాయకులపై దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకొంటున్న విషయం తెలిసిందే.
గురువారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏపీ డీజీపి మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ఆధారంగా అమాయకులపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తున్నవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నామని డీజీపీ చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని డీజీపీ మాలకొండయ్య హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగా నలుగైరుదుగురిపై దాడులు జరిగాయి.
సోషల్ మీడియాలో ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని దాడులు చోటు చేసుకొంటున్న ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అమాయకులపై దాడులు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై బాబు పోలీసు అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications