వైసీపీ అడ్రస్ గల్లంతే, పోరాటాలే రెండోసారి టిక్కెట్టు: సీఎం రమేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాజ్యసభ సభ్యుడిగా మరోసారి తనకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకం ఉంచి రెండో సారి భాద్యతలను అప్పగించిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోనని సీఎం రమేష్ చెప్పారు.

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అత్యంత సస్పెన్స్‌తో వ్యవహరించారు. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న వర్ల రామయ్య పేరును చివరి నిమిషంలో రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధుల పేర్లలో సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర పేర్లను ఖరారు చేసింది. తమకు పార్టీ నాయకత్వం రాజ్యసభ అభ్యర్ధిత్వాలను కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 నా పోరాటాలు రెండోసారి రాజ్యసభకు పంపాయి

నా పోరాటాలు రెండోసారి రాజ్యసభకు పంపాయి

రాజ్యసభకు తాను 2012లో ఎన్నికయ్యాయనని సీఎం రమేష్ చెప్పారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులను రాబట్టేందుకు పోరాటం చేశాననన్నారు. తన పనితీరును గుర్తించిన తనకు రెండో సారి రాజ్యసభకు పంపారని సీఎం రమేష్ గుర్తు చేసుకొన్నారు.

 వైసీపీ అడ్రస్ గల్తంతు చేస్తాం

వైసీపీ అడ్రస్ గల్తంతు చేస్తాం

ఈసారి రాయలసీమలో వైసీపీ గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘నాపై అచంచల విశ్వాసంతో చంద్రబాబునాయుడు, లోకేశ్ నన్ను రెండో సారి రాజ్యసభకు పంపిస్తున్నారు. అందుకు, ధన్యవాదాలు. కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు సీఎం రమేష్.వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించనున్నట్టు చెప్పారు. తనకున్న పరిచయాల ద్వారా కడప జిల్లాతో పాటు రాయలసీమలో వైసీపీ అడ్రస్ గల్తంతు చేయనున్నట్టు చెప్పారు సీఎం రమేష్.

టిడిపి హయంలోనే రాయలసీమ అభివృద్ది

టిడిపి హయంలోనే రాయలసీమ అభివృద్ది

రాయలసీమ అభివృద్ది విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా బిజెపిపై ఎంపీ సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. టిడిపి హయంలో రాయలసమీ అభివృద్ది జరిగిందన్నారు.కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నామని సీఎం రమేష్ గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు పరిశ్రమలు, డిఫెన్స్ ఇనిస్టిట్యూట్, అలాగే, గాలేరి-నగరి, హంద్రీనీవా నీటిని అందిస్తున్నామంటే ఈ ఘనత చంద్రబాబునాయుడిదే. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా కడపలో రైతాంగానికి నీటిని అందిస్తున్నాం. వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమను ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రమేష్ చెప్పారు.

 టిడిపిలో కార్యకర్తలకు గుర్తింపు

టిడిపిలో కార్యకర్తలకు గుర్తింపు

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనను ఎంపిక చేయడంపై కనకమేడల రవీంద్రకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. లీగల్ సెల్ ద్వారా పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు, తనకు పూర్తి న్యాయం చేశారని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని,ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. పార్టీ పటిష్టతకు పాటుపడతానని చెప్పారు. ముప్పై ఐదేళ్లుగా తాను న్యాయవాద వృత్తిలో ఉన్నానని, ఇరవై రెండేళ్లుగా టీడీపీ లీగల్ సెల్, అందుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు తన కృతఙ్ఞతలు తెలిపారు., ఏపీకి హక్కుల సాధనకు దశలవారీ పోరాటంలో భాగంగా అన్ని మార్గాలను అవలంబిస్తామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Mp Cm Ramesh Thanked to Chandrababu naidu for extended his Rajya Sabha tenure. he spoke to media on Sunday at Amaravathi.we will win majority seats from kadapa in 2019 elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి