ఏపీకి బిగ్ అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీవానలు కురుస్తాయని తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మన్యం, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఉభయ గోదావరి, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, రైతు కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడక్కడా ఈదురుగాలులు వీస్తాయి. 10 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మామిడి, నిమ్మ, అరటి, వరికి, మిర్చి పంటకు అపారమైన నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి రైతులకు సీజన్ కావడంతో వాళ్లు కూడా ఆందోళనలో ఉన్నారు. తమను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు కోరుతున్నారు. మరోసారి వర్ష సూచన చేయడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications