వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చేయాలో: వారి గోడు, భయంతో బతకొద్దని పవన్, బాబుకు 'పవర్' పంచ్

|
Google Oneindia TeluguNews

ఏలూరు: అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలే కానీ భయంతో బతకకూడదని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం అన్నారు. ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా మెగా అక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యలు కూడా అంతే ముఖ్యమన్నారు.

హైదరాబాదులో జనసేన కార్యాలయంలో ఆయనను కలిసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఫుడ్ పార్క్ సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని చెప్పారు.

Pawan Kalyan

అయితే ప్రభుత్వం చేసే అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలేగానీ, భయంతో బతకకూడదన్నారు. కాగా, పవన్‌ను కలిసిన ఫుడ్ పార్క్ బాధితులు ఈ మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని తెలిపారు. 30 గ్రామాల ప్రజలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో తమకు తెలియడం లేదని, మీరే సాయం చేయాలని వారు పవన్‌ను కోరారు.

చంద్రబాబుకు అది 'పవర్' పంచ్

కాగా, అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలే కాని, భయంతో బతక కూడదని చెప్పడం ద్వారా... పవన్ కళ్యాణ్ బాధిత గ్రామాల ప్రజలకు అండగా నిలబడ్డారని, భయంతో బతకకూడదని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంచ్ అి అంటున్నారు.

English summary
West Godavari people met Jana Sena party chief Pawan Kalyan on Wednesday in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X