నమ్మి ఓటెస్తే! చిటికెలో మార్చేస్తాం: లోకేష్‌కు ప.గో యువకుడి వార్నింగ్

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ సామాన్యుడు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, మెరుగుపడని వ్యవస్థలపై మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని కోరాడు. ట్విట్టర్ ద్వారా తన లేఖను పంచుకున్నారు కిరణ్.

మీ మాటతో సంతోషించా.. కానీ..

మీ మాటతో సంతోషించా.. కానీ..

మంగళవారం ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ‘గ్రామాలకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టే' అంటూ మీరు(నారా లోకేశ్‌) చెప్పిన మాట విని చాలా సంతోషించినట్లు తెలిపాడు. అయితే, తనకు ప్రస్తుతం కొన్ని సందేహాలు ఉన్నాయని వాటి తీర్చాలని కోరాడు.

చిటికెలో పనంటూ వార్నింగ్..

చిటికెలో పనంటూ వార్నింగ్..

రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందనే మాట కనికట్టులా కనిపిస్తోందని, మిమ్మల్ని మించిన తెలివైన వారు లేరని అనుకోవద్దని హితవు పలికాడు. రాష్ట్రంలో మీకు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం ప్రజలకు చిటికేసినంత పని అని లోకేశ్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

నేనూ, నా కుటుంబం కూడా ఓటు వేస్తే..

నేనూ, నా కుటుంబం కూడా ఓటు వేస్తే..

అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి మంచిదని గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తాను, తన కుటుంబసభ్యులు 2014 ఎన్నికలలో తెలుగుదేశంకు ఓటు వేసి గెలిపించామని అతడు పేర్కొన్నాడు. అయితే, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మాత్రం సంతోషకరంగా లేవని అన్నారు.

వైరల్‌గా లేఖ..

అభివృద్ధిలో ఏమోగానీ, అవినీతిలో మాత్రం ముందున్నామంటూ ఎద్దేవా చేశారు. తాను ఒక సామాన్యుడినని, ఏ పార్టీకి చెందినవాడిని కాదని కిరణ్ ముందుగానే తెలియజేయడం గమనార్హం. కాగా, కిరణ్ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A West Godavari youth warned Andhra Pradesh minister Nara Lokesh for government failures.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి