వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబుకు తెలియదా, వెంకయ్యా! నేనే దిక్కన్నావ్', 'విధ్వంసం కోసం జగన్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తెలియకుండా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసామని మంత్రి నారాయణ చెప్పడం విడ్డూరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సుక్రవారం అన్నారు. మంత్రి నారాయణ వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని కోసం భూసేకరణ పైన చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, ఆ సవాలును తాము స్వీకరిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు కలిసినప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అడిగారా లేక హామీల గురించి అడిగారా చెప్పాలన్నారు.

గుంటూరు జిల్లాలో శిశువ మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 స్మార్ట్ సిటీలు ఇస్తామని బిజెపి చెప్పిందని, ఇప్పుడు మూడే ఇచ్చారేమిటని ప్రశ్నించారు. రేపటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బందుకు తమ మద్దతు లేదని చెప్పారు. బిజెపి, టిడిపిలవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధానాలు అని మండిపడ్డారు.

What about 13 smart cities?: Raghuveera to Venkaiah Naidu

వెంకయ్యా! నేనే దిక్కు అన్నావ్.. ఏమయింది: సిఆర్

ఏపీకి తానే దిక్కని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి స్మార్ట్ సిటీలు తీసుకు రావడంలో విఫలమయ్యారన్నారు. టిడిపి - బిజెపి డబుల్ గేమ్ ఆడుతున్నాయన్నారు. పదిహేను నెలల కాలంలో ఈ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు.

జగన్ పైన ఎమ్మెల్సీ శ్రీనివాసులు ధ్వజం

ఏపీకి ప్ర్తత్యేక హోదా పేరుతో వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ విధ్వంసం చేయాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు శ్రీనివాసులు శుక్రవారం నిప్పులు చెరిగారు.

English summary
APCC chief Raghuveera Reddy has questioned Union Minister Venkaiah Naidu about smart cites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X