పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, జనసేన ప్రస్థానంపై చంద్రబాబు ఏమన్నారంటే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల క్రితం జనసేన పార్టీ పెట్టి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సేవా, నిబద్ధత, విలువలకు ప్రతీకగా రాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టించడానికి, నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ రాజకీయ ప్రయాణం నేడు దేశానికే ఆదర్శంగా మారింది.
జనసేనానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆటుపోట్లను తట్టుకొని ఓటమిని, పరాభవాలను ఓర్చుకొనీ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఎక్స్ వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు జనసైనికులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న చంద్రబాబు ఈ సందర్భంగా తాను పవన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. అంతకుముందు నారా లోకేష్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు.
రాష్ట్ర పురోగతిలో, శ్రేయస్సులో జనసేన పాత్ర కీలకం
పవన్ కళ్యాణ్ అన్నకు అభినందనలు, జనసేన నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, జనసేన నిబద్ధత ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. రాష్ట్ర పురోగతిలో, శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుందని ఐటి విద్యా ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
జనసేన సభకు ఇసుకేస్తే రాలనంత మంది జనం
కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనసైనికులు తరలివచ్చారు . ఈ సభ నేపథ్యంలో పిఠాపురం పరిసర ప్రాంతాలు ఇసుకేస్తే రాలనంత మంది జనంతో కిక్కిరిసిపోయాయి.












Click it and Unblock the Notifications