అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ కానిస్టేబుళ్ళ ఆత్మహత్యాయత్నం, సెలవులో ఎస్ఐలు, కుప్పంలో ఏం జరుగుతోంది?

క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో కలకలం రేగుతోంది. కుప్పం పోలీస్ స్టేషన్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసుశాఖలో ప్రకంపనలు కల్గిస్తున్నాయి.మహిళా పోలీసు విభాగం చేస్తున్న సేవలకు రాష్ట్ర ఉత్తమ షీ టీమ్అవ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కుప్పం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో కలకలం రేగుతోంది. కుప్పం పోలీస్ స్టేషన్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసుశాఖలో ప్రకంపనలు కల్గిస్తున్నాయి.మహిళా పోలీసు విభాగం చేస్తున్న సేవలకు రాష్ట్ర ఉత్తమ షీ టీమ్అవార్డును అందుకొన్న చిత్తూరు విభాగంలో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు సంచలనంగా మారాయి.

చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్న పరిణామాలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలానికి కారణంగా మారాయి.కుప్పం సిఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల కొందరు పోలీసులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

షీ టీమ్ వాట్పాప్ గ్రూప్ లో తమతో పాటు నలుగురు మహిళా కానిస్టేబుళ్ళు మేసేజ్ పెట్టారు. సీఐ బూతులు తిడుతున్నారని, తమకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. గ్రూప్ లో డీజీపి సైతం ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లోనే ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కుప్పం పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతోంది?

కుప్పం పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతోంది?

కుప్పం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిర్మల రెండేళ్ళుగా షీ టీమ్స్ విభాగంలో కుప్పం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది.అయితే తాను విధుల్లో చేరిననాటి నుండి సిఐ రాజశేఖర్ అందరిముందు అసభ్యపదజాలంతో దూషిస్తూ స్టేషన్ లో అందరిముందు అవమానకరంగా మాట్లాడుతున్నారని నిర్మల ఆరోపిస్తున్నారు. 20 రోజుల క్రితం షీ టీమ్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ విషయమై బాధితురాలు తాను గురౌతున్న వేధింపులను పోస్ట్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేయాలని డీజీపి ఎస్ పి ని ఆదేశించారు. ఎస్పీ నుండి మహిళా స్టేషన్ కు డిఎస్పీని విచారణ చేయాలని ఆదేశించారు.

విచారణాధికారి తీరుతో విసిగి ఆత్మహత్యాయత్నం

విచారణాధికారి తీరుతో విసిగి ఆత్మహత్యాయత్నం

గత నెల 24వ, తేదిన రేణుక చిత్తూరుకు వచ్చి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్ పిని కలిసి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. అయితే ఏం జరిగిందని అడగకుండా అసలు వాట్సాప్ లో ఏది పడితే అది పెట్టమని మీకు ఎవరు చెప్పారంటూ గద్దించడంతో భయపడ్డారు. రెండు రోజుల తర్వాత వస్తే విచారిస్తామని చెప్పడంతో మళ్ళీ చిత్తూరుకు వచ్చారు. ఇలా ఏడుసార్లు కుప్పం నుండి చిత్తూరుకు తిరిగి విసిగి వేసారారు బాధితులు. కుప్పం నుండి చిత్తూరుకు తిరిగి విసిగిపోయారు బాధితులు. మంగళవారం నాడు డిఎస్పీ ని కలిసేందుకు వచ్చారు. డిఎస్పీ కలవకపోవడంతో నిర్మల ఆత్మహాత్యయత్నానికి ప్రయత్నించింది.. అయితే ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బతికి బయటపడింది.

కుప్పం పోలీస్ స్టేషన్ లో అనేక ఘటనలు

కుప్పం పోలీస్ స్టేషన్ లో అనేక ఘటనలు

కుప్పం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిఐ రాజశేఖర్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆర్నెళ్ళ క్రితం సిఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు ఆమెను రక్షించారు.అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారులు తొక్కిపట్టారనే విమర్శులు ఉన్నాయి. తాజాగా ఈ ఘటనలు చోటుచేసుకొన్నాయి.

సెలవుపై వెళ్ళిన ఎస్ ఐ లు

సెలవుపై వెళ్ళిన ఎస్ ఐ లు

కుప్పం సర్కిల్ లోకి వచ్చే రాళ్ళబుదుగూరు ఎస్ ఐ గోపి, రామకుప్పం ఎస్ ఐ పరశురామ్, కుప్పం ఎస్ ఐ వెంకటచిన్నలు సిఐ వేధింపులు తట్టుకోలేక మెడికల్ లీవుపై వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ స్టేషన్లలో కొత్త ఎస్ ఐ లు పనిచేస్తున్నారు. అయినా సరే ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు.అయితే తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడమే తప్పా అంటూ మహిళా కానిస్టేబుళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
What is going on in Kuppam police station, Nirmala , female constable suicide attempt recently. 3 SI's went to leave . female constables demanded to higher officers to conduct enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X