వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం పార్టీలో ఏం జ‌రుగుతోంది? దివ్య‌వాణి ఏం చెప్పింది? అస‌లు టీడీ జ‌నార్థ‌న్ ఎవ‌రు?

|
Google Oneindia TeluguNews

"బాదుడే బాదుడు" కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌తోపాటు "మ‌హానాడు" దిగ్విజ‌యం కావ‌డంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. ఇటువంటి త‌రుణంలో పార్టీ అధికార ప్ర‌తినిధి దివ్య‌వాణి త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న లోపాల‌ను మీడియా స‌మావేశంలో ఏక‌రువు పెట్టారు. చంద్ర‌బాబునాయుడు త‌న‌కు తండ్రిలాంటివార‌ని, ఆయ‌న్ను ఎవ‌రైనా ఒక మాట‌న్నా త‌ట్టుకోలేన‌ని, ఆగ్ర‌హం వ‌స్తుంద‌ని, అటువంటి వ్య‌క్తిని పార్టీలోని కొంద‌రు వ్య‌క్తులు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

తెలుగు త‌మ్ముళ్లు చెప్పిందే దివ్య‌వాణి చెప్పారు!!

తెలుగు త‌మ్ముళ్లు చెప్పిందే దివ్య‌వాణి చెప్పారు!!

దివ్య‌వాణి తాజాగా చెప్పింది అనేదానిక‌న్నా గ‌తం నుంచే చంద్ర‌బాబునాయుడు పార్టీలో కొంద‌రి చేతిలో బందీ అయ్యారంటూ తెలుగు త‌మ్ముళ్లు చెబుతుంటారు. మీడియాలో కూడా ఈ కోణంలోనే చంద్ర‌బాబునాయుడిపై వార్త‌లు వ‌స్తుంటాయి. పార్టీలో సీనియ‌ర్ నేత‌ల నుంచి యువ‌నేత‌ల వ‌ర‌కు అంద‌రిదీ ఇదే అభిప్రాయమంటే అతిశ‌యోక్తి కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

దివ్య‌వాణి ఆరోపించిన తొండెపు ద‌శ‌ర‌థ జ‌నార్ధ‌న్‌పై పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు కూడా గుర్రుగా ఉన్నారుకానీ బ‌య‌ట‌ప‌డితే అనవసరంగా పార్టీ పరువు తీసినవారిమవుతామనే ఉద్దేశంతో వారు కూడా వాస్తవాలను చంద్రబాబు దగ్గరకు తేలేకపోతున్నారన్నారని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు. చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌ర‌కు వాస్త‌వ స‌మాచారం వెళ్ల‌కుండా టీడీ జ‌నార్ద‌న్ అడ్డుకుంటున్నారంటూ దివ్య‌వాణి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

అస‌లు ఎవ‌రీ టీడీ జ‌నార్థ‌న్‌?

అస‌లు ఎవ‌రీ టీడీ జ‌నార్థ‌న్‌?

టీడీ జ‌నార్ధ‌న్ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌రు. మీడియా ముందుకు అస‌లు రారు. చంద్ర‌బాబుకు ముందు, వెన‌కా అంతా తానే అయి వ్య‌వ‌హ‌రించేది టీడీ జనార్థ‌న్ అనే విష‌యం పార్టీలోని నేత‌లంద‌రికీ తెలుసు. తొండెపు దశరధ జనార్థన్ ను అంద‌రూ టీడీ జ‌నార్ధ‌న్ అని పిలుస్తుంటారు. ఆయ‌న మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాం బంధువుగా తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చారు.

2004 ముందు వ‌ర‌కు క్రియాశీల‌కంగా లేరు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో కూడా ఎప్పుడూ పోటీచేయ‌లేదు. 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న‌కు ఆప్కాబ్ చైర్మ‌న్ ప‌ద‌వినిచ్చారు.

ఆయ‌న కూడా పార్టీలో అంద‌రికీ ఆప్కాబ్ చైర్మ‌న్‌గా నే ప‌రిచ‌య‌మ‌య్యారు. అనంత‌రం పార్టీలో క్రియాశీల‌కంగా మారుతూ కేంద్ర కార్యాల‌యంలో వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతుండేవారు. ఆ త‌ర్వాత పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడికి బాగా ద‌గ్గ‌రై న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా మారారు.

ఆయ‌న‌పై ఫిర్యాదు చేసే ధైర్యం ఎవ‌రికీ లేదు!

ఆయ‌న‌పై ఫిర్యాదు చేసే ధైర్యం ఎవ‌రికీ లేదు!

2014లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు టీడీ జ‌నార్ధ‌న్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. టీడీ జనార్ధ‌న్ అనే వ్య‌క్తిని ప్ర‌శ్నించినందుకు న‌న్ను ఇబ్బంది పెట్టారు.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఏం చేసినా, ఆయ‌న్ను గ‌ట్టిగా ప్ర‌శ్నించినా తెలుగుదేశం పార్టీలో వారికి స్థానం ఉండ‌ద‌ని దివ్య‌వాణి ఆరోపించారు.

చంద్ర‌బాబునాయుడిని క‌ల‌వాలంటే ముందుగా టీడీ జ‌నార్ధ‌న్‌ను క‌ల‌వాల్సి ఉంటుంద‌న్నారు. కానీ పార్టీలో ఎవ‌రికీ ఆయ‌న‌పై చంద్ర‌బాబునాయుడికి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలోనే చాలామంది టీడీపై ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో బాబు కూడా వాటిని సీరియ‌స్‌గా తీసుకోవ‌డ‌లేద‌ని పార్టీ సీనియ‌ర్ నేతలు భావిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి పాల‌వ‌డానికి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు అనుస‌రిస్తు తీరు, వారి వ్య‌వ‌హారం, జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో చేసిన ప‌నుల‌పై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసి పార్టీని చ‌క్క‌దిద్దేలా చేయ‌డానికి రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంతోమంది తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాలేక‌పోయార‌నే విష‌యం తెలిసిందే.

టీడీ జ‌నార్ధ‌న్‌ను క‌ట్టడి చేస్తేకానీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని వాస్త‌వ ప‌రిస్థితులు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు చేర‌వ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం అంగీక‌రిస్తున్నారు. దివ్యవాణి చెప్పినవాటిలో వాస్త‌వాల‌ను ప‌రిశీలించి పార్టీని చ‌క్క‌దిద్దాల‌ని తెలుగు త‌మ్ముళ్లు సైతం కోరుతున్నారు.

English summary
What is happening in Telugudesam party? What did the divine voice say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X