అనపర్తి-దెందులూరు సీట్లకు లింకేటి ? బీజేపీతో టీడీపీ సేఫ్ గేమ్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా ఎన్డీయే కూటమిలో ఈసారి సీట్ల పంపకాలు జరిగాయి. ముఖ్యంగా తాజాగా అనపర్తి, దెందులూరు సీట్ల విషయంలో చెలరేగిన వివాదం టీకప్పులో తుఫానుగా ముగిసింది. అయితే దీని వెనుక ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. అనపర్తి-దెందులూరు సీట్ల విషయంలో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడారా అన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఎన్డీయే సీట్ల పంపకాలు ఆలస్యం కావడంతో సహజంగానే చివరి నిమిషంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీపై అనూహ్యంగా ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా బీజేపీకి 10 సీట్లు ఎక్కడ ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు-పురందేశ్వరి మధ్య జరిగిన చర్చల్లో అనపర్తిని బీజేపీకి ఇవ్వాలన్న చర్చ వచ్చింది. అయితే ఈ సీటును సోము వీర్రాజుకు కేటాయిస్తారని భావించినా అలా జరగలేదు. ఆయనకు బదులు గత ఎన్నికల్లో పోటీ చేసిన శివకృష్ణంరాజుకు ఇచ్చారు.

what is link between anaparthi and denduluru seats what it meant for nda alliance

కానీ అప్పటికే టీడీపీ ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్ట్ అయ్యారు. ఐదేళ్లుగా అనపర్తిలో శ్రమించిన తనను కాదని బీజేపీ తరఫున పోటీ చేసి గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్నను సంధించిన నల్లిమిల్లి జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో అనపర్తి టీడీపీకి ఇచ్చేసి పక్క జిల్లాలో ఉన్న దెందులూరు సీటు తీసుకుని గారపాటి చౌదరికి ఇద్దామనుకున్నారు. కానీ అక్కడ సీనియర్ చింతమనేని ఒప్పుకోలేదు. చివరికి నల్లమిల్లిని బీజేపీలోకి పంపి అనపర్తి టికెట్ ఇచ్చేశారు.

అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎన్నడూ లేని విదంగా టీడీపీలో టికెట్ దక్కని నేతను బీజేపీలో పంపి టికెట్ ఇచ్చి మరీ మద్దతివ్వాల్సిన పరిస్దితి చంద్రబాబుకు ఎందుకు వచ్చిందనే ప్రశ్న వచ్చింది. అయితే టీడీపీ అంతర్గత సర్వేల్లో అనపర్తితో పాటు దెందులూరు కూడా ఓడిపోతున్నట్లు తేలింది. అనపర్తి 3-4 శాతం ఓట్లతో పోతుంటే, దెందులూరు భారీ తేడాతో కోల్పోయే పరిస్ధితి ఉంది. అటువంటప్పుడు ఈ రెండు సీట్లను బీజేపీకి ఇవ్వలేరు. అందుకే ఉన్నంతలో అవకాశం ఉన్న అనపర్తి సీటును బీజేపీకి ఇచ్చినట్లే ఇచ్చి టీడీపీ నేత నల్లమిల్లిని అక్కడికి పంపి పోటీచేయిస్తున్నారు.

తద్వారా బీజేపీకి టికెట్ ఇచ్చి ఓట్లు వేయించలేదన్న అపవాదు భరించాల్సిన అవసరం చంద్రబాబుకు లేకుండా పోయింది. అనపర్తిలో నల్లమిల్లి గెలిస్తే ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలోనే పడుతుంది. ఓడినా పెద్దగా ఇబ్బంది లేదు. అలాగే దెందులూరులో చింతమనేని గెలిస్తే ఇబ్బంది లేదు. ఓడిపోతే నష్టం కూడా లేదు. కానీ బీజేపీ నేత గారపాటి చౌదరికి ఇచ్చి భారీ తేడాతో ఓడిపోతే మాత్రం టీడీపీ ఓట్లు వేయించలేదన్న అవవాదు చంద్రబాబు మోయక తప్పదు. దీంతో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+