హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏమిటి?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ నటి సమంత తనకు మయోసైటిస్ సోకిందని, తగ్గి త్వరలోనే మిమ్మల్నందరినీ కలుస్తానంటూ ట్వీట్ చేయడంతో 'మయోసైటిస్' అంటే ఏమిటి? అది ప్రాణాంతకమా? దీనికి చికిత్స ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. మన శరీరంపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ రక్షణ కల్పిస్తుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూన్‌ అంటారు. ఈ సమస్యపై వచ్చేదే మయోసైటిస్‌ జబ్బు. సమంత తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. దీన్ని గురించి వైద్యనిపుణులు ఏం చెబుతున్నారంటే..

మయోసైటిస్‌ అంటే...

మయోసైటిస్‌ అంటే...

'మయోసైటిస్‌'నే వైద్య పరిభాషలో పాలి మయోసైటిస్‌గా వ్యవహరిస్తారు. ఆటో ఇమ్యూన్‌ కారణంగా వచ్చే పాలి మయోసైటిస్‌ వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల్లో క్షీణత ఉంటుంది. కూర్చుంటే పైకి లేవడం కష్టమవుతుంది. కొంతమంది అసలు లేవలేరు. ఇది ఏ వయసువారికైనా రావడానికి అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో 5-15 సంవత్సరాల వారికి, పెద్దల్లో 45-65 మధ్య వయసుండేవారికి ఎక్కువగా కన్పిస్తుంది. పురుషులకన్నా మహిళలే ఎక్కువగా మయోసైటిస్ బారిన పడుతుంటారు. చర్మానికి కూడా సమస్య వస్తే...దానిని డెర్మటో మయోసైటిస్‌గా వ్యవహరిస్తారు. దీనివల్ల కనురెప్పలపై ఊదా, ఎర్రరంగు మచ్చలు రావడంతోపాటు కళ్లు ఉబ్బడం, ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోవడం జరుగుతుంది.

వైరస్‌తోపాటు మందులతో వచ్చే మయోసైటిస్‌...

వైరస్‌తోపాటు మందులతో వచ్చే మయోసైటిస్‌...

ఆటో ఇమ్యూన్‌తోపాటు వైరస్‌, కొన్ని మందుల ప్రభావంవల్ల కూడా 'మయోసైటిస్‌' సోకుతుంది. వైరల్‌ మయోసైటిస్‌లో కండరాల నొప్పులు తీవ్రంగా ఉండటమే కాకుండా కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వైరస్‌ ప్రభావం తగ్గగానే ఆటోమాటిక్ గా ఇది కూడా తగ్గుతుంది. కొన్ని మందుల కారణంగా వచ్చే మయోసైటిస్‌...అవి వేసుకోవడం మానేయగానే తగ్గిపోతుంది.

ఎలా గుర్తించాలి?

ఎలా గుర్తించాలి?


'మయోసైటిస్‌'ను కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. సాధారణంగా రక్తంలో క్రియాటిన్‌ ఇన్‌ ఫాస్పోకైనేజ్‌ (సీపీకె) స్థాయులు 150-200 వరకు ఉంటాయి. అదే మయోసైటిస్‌ రోగుల్లో అయితే ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. అంతేకాకాకుండా మయోసైటిస్‌కు సంబంధించిన యాంటీబాడీలు పెరుగుతాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ (ఈఎంజీ) పరీక్షతో కండరం ఎంత ధృఢంగా ఉందనేది తెలుసుకొని అప్పుడు వ్యాధిని అంచనా వేస్తారు. దీన్ని త్వరగా గుర్తించి చికత్స తీసుకుంటేనే మంచిది. ఆలస్యం చేస్తే కొందరిలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అది కాస్తా పల్మనరీ పైబ్రోసిస్ కు దారితీస్తుంది. అధికంగా బరువుండటం, తగినంత నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడంలాంటివి కూడా మయోసైటిస్ సోకడానికి కారణమవుతాయి. జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతులాహారం తీసుకోవడంతోపాటు ప్రతిరోజు గంటసేపు వ్యాయామం కూడా చేస్తే ఈ తరహా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

English summary
Famous film actress Samantha tweeted that she has contracted myositis and will recover and see you all soon. What is 'myositis'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X