వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక‌స్మాత్తుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌కు కార‌ణం??

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్టోబ‌రు 5వ తేదీ నుంచి బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌బోతున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేయ‌బోతున్నారు. దీనికోసం కొత్త‌గా 8 స్కార్పియోల‌ను కూడా కాన్వాయ్ కోసం కొనుగోలు చేశారు. ఉన్న‌ట్లుండి ఇంత అక‌స్మాత్తుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ యాత్ర పెట్టుకోవ‌డానికి వేరే కార‌ణం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

 అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే అంచ‌నాతో అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌కు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం' పేరుతో తొమ్మిది నెల‌ల కార్య‌క్ర‌మాన్ని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు 'బాదుడే బాదుడు'తోపాటు 'మ‌హానాడు' నిర్వ‌హించారు. భార‌తీయ జ‌న‌తాపార్టీ 'గోదావ‌రి గ‌ర్జ‌న' పేరుతో రాజ‌మండ్రిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అక్టోబ‌రు 5వ తేదీ నుంచి బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌కు కార‌ణం ముంద‌స్తు ఎన్నిక‌ల‌క‌న్నా మ‌రో బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని జ‌న‌సైనికులు
వెల్ల‌డించారు.

 ప‌వ‌న్ ఆప్ష‌న్ల‌ను కొట్టిపారేసిన టీడీపీ, బీజేపీ?

ప‌వ‌న్ ఆప్ష‌న్ల‌ను కొట్టిపారేసిన టీడీపీ, బీజేపీ?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడు ఆప్ష‌న్లు ప్ర‌క‌టించారు. అయితే రెండు కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంత‌మైన ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఆప్ష‌న్ల‌ను ప‌ట్టించుకోలేదు. పొత్తుల గురించి బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్దంటూ అధికార ప్ర‌తినిధుల‌కు, నాయ‌కులంద‌రికీ అంత‌ర్గ‌తంగా ఆదేశాలు అందాయి. మూడు ఆప్ష‌న్ల గురించి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం స్పందించ‌లేదు. ఒక‌ర‌కంగా లైట్ తీసుకున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. అలాగే ఒక‌శాతం ఓటుబ్యాంకు లేని మిత్ర‌ప‌క్షం బీజేపీ కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ను ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించ‌డంలేదు.

Recommended Video

Chandrababu Naidu పార్టీ సమావేశాలు, రోడ్ షో లు ఏడాది పాటు Schedule *Politics | Telugu Oneindia
 జ‌న‌సేన బ‌లం చూపించ‌డానికే!!

జ‌న‌సేన బ‌లం చూపించ‌డానికే!!

దీంతో ప‌వ‌న్ త‌న స్టామినా ఏమిటో ఇత‌ర పార్టీల‌కు తెలియ‌జెప్ప‌డానికి, ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన‌కు ఉన్న స్పంద‌న చూపించ‌డానికి, త‌మ ఓటుబ్యాంకు ఎంత శాతం పెరుగుతుందో ఇత‌ర పార్టీలు అంచ‌నా వేసుకోవ‌డంతోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన బ‌లం నిరూపించ‌డానికే ఈ యాత్ర చేప‌ట్టిన‌ట్లుగా జ‌న‌సైనికులు వెల్ల‌డించారు. పొత్తు వ‌ద్దు ఒంట‌రిగా వెళ‌దామంటున్న తెలుగు త‌మ్ముళ్ల‌తోపాటు త‌న‌ను ముఖ్యమంత్రిగా అంగీక‌రించ‌ని బీజేపీతీరు వ‌ల్ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాగా నొచ్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌ప్పుడు త‌ను యాత్ర చేయాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని తెలిపిన ప‌వ‌న్ అందుకు సిద్ధ‌ప‌డే యాత్ర చేస్తున్నారంటూ ఈ రెండు పార్టీల తీరువ‌ల్ల ప‌వ‌న్ మ‌న‌సు ఎంత నొచ్చుకుందో అర్థ‌మ‌వుతోంద‌ని జ‌న‌సేన శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మ‌రి జ‌న‌సేనాని త‌న బ‌లాన్ని ఎంత‌వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌కు చూపిస్తారో వేచిచూడాల్సి ఉంది.!!

English summary
ego hurting the reason for the sudden Pawankalyan bus tour?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X