పవన్‌కు షాక్: ఏ అధికారంతో లెక్కలడుగుతున్నారు: విష్ణు సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జెఎఫ్‌సికి ఏం అధికారం ఉందని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై అన్యాయం జరిగిందని రాష్ట్రానికి చెందిన ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

జెఎఫ్‌సిపై ట్విస్టిచ్చిన బాబు: అందుకే ప్యాకేజీకి ఒప్పుకొన్నా, జగన్ అప్పుడేం చేశారు?

అయితే రాష్ట్రానికి వచ్చిన నిధులు, కేంద్రం ఇచ్చిన నిదుల విషయమై టిడిపి, బిజెపి నేతలు జెఎఫ్‌సి కమిటీకి వివరాలివ్వాలని కోరారు. మంగళవారం నాడు బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ దూకుడు: జెఎఫ్‌సి లోగో విడుదల, ప్రత్యేక హోదానే అస్త్రం

జెఎఫ్‌సి కమిటీకి ఏం అధికారం ఉంది

జెఎఫ్‌సి కమిటీకి ఏం అధికారం ఉంది

కేంద్రానికి రాష్ట్రం నుండి వచ్చిన నిధుల విషయమై టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ తరుణంలో రెండు పార్టీలు తమ లెక్కలను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడుతున్న నిజనిర్ధారణ కమిటీకి ఏం అధికారముందని శ్వేతపత్రం చూపాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.

టిడిపి పొలిటికల్ జిమ్మిక్కులు

టిడిపి పొలిటికల్ జిమ్మిక్కులు

ఏపీ రాష్ట్రంలో టిడిపి పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తోందని బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. బీజేపీపై టీడీపీ బురదజల్లాలని చూస్తోందని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. అలాగే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేసిన నిరసన ఏపీ ప్రజలను అవమానపరిచేలా ఉందని చెప్పారు.

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తనకు దక్కడం లేదని బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు తనకు సమయాన్ని కేటాయించకపోవడంపై విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పాదయాత్రపై చర్చే లేదు

జగన్ పాదయాత్రపై చర్చే లేదు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రపై ప్రజలు చర్చించుకోవడం లేదని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకమార్ రాజు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నా టిడిపి ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. అష్టవంకర్లతో ఉన్న గదిని అసెంబ్లీలో తనకు కేటాయించారని, ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆయన వాపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Vishnukumar Raju said that what is the power to JFC for provide white paper. He spoke to media on Tuesday at Vishakapatnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి