మీడియా జీవోలో తప్పేముంది... ? మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విడుదల చేసిన జీవో లో తప్పేముందని మంత్రి పేర్నీ నాని ప్రశ్నించారు. ఈ జీవోపై టీడీపీ నాయకులు మీడియాకు సంకెళ్లు అంటూ దుష్ప్రచారం చేయడం కరెక్టు కాదని అన్నారు. జీవో వల్ల పత్రికా స్వేచ్ఛకు ఇబ్బందేమి లేదని అన్నారు.
ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రభుత్వ శాఖలు ఇతర అంశాలపై నిరాధారమైన వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా శాఖల కార్యదర్శులకు ఇస్తూ జీవో జారీ చేశారు. అయితే దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. జీవో తీసుకురావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దీంతో ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు పేర్నీ నానీ, మరియు కొడాలి నానిలు తిప్పికొట్టారు. జీవోపై టీడీపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని వారు విమర్శించారు.

వార్త పత్రికల్లో కాని, ప్రసారమాధ్యమాల్లోగాని ప్రచురించిన లేదా ప్రసారం చేసిన కథనాలు అవాస్తవమని తేలితే వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం వారిపై చర్యలు తీసుకునే విధంగా జీవో తీసుకువచ్చామని, అందులో తప్పేముందని అన్నారు. జీవో ప్రకారం తప్పుడు కథనాలు ప్రచురించినవారు సంబంధిత అధికారుల వివరణను ప్రచురించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. జీవో ప్రకారం జర్నలిస్టులపై ఎలాంటీ కేసులు పెట్టేది లేదని చెప్పారు. ఇక నిజాలు రాస్తున్న జర్నలిస్టులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఆధారాలతో రాసిన జర్నలిస్టు కథనాలను తాము కూడ స్వాగతిస్తామని అన్నారు. కాని జరగని వాటిని ఊహించి రాయడం మంచిది కాదని అలాంటీ ఉహాతీతమైన కథనాలు రాయవద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications