ఓవైపు భక్తి.. మరోవైపు రక్తి..? 30 ఇయర్స్ పృథ్వీపై వేలాడుతున్న కత్తి..
అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ చైర్మన్,వైసీపీ నేత పృథ్వీ మరో వివాదంలో ఇరుక్కోవడం దుమారం రేపుతోంది. ఆధ్యాత్మిక పదవిలో ఉన్న ఆయన ఆ ముసుగులో ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియో టేపు కూడా లీక్ కావడం కలకలం రేపుతోంది. కామాంధుడైన పృథ్వీ ఎస్వీబీసీ పదవికి అనర్హుడని.. వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీ భవితవ్యంపై
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఆడియో టేపు లీక్ :
ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేపు బయటకు లీక్ అయింది. 'పడుకునేటప్పుడు నేను గుర్తు రాలేదా..?' అంటూ మొదలుపెట్టిన పృథ్వీ.. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే ఆ టేపుల్లో అవతలి మహిళ కూడా పృథ్వీకి అనుకూలంగానే మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. దీనిపై ఎస్వీబీసీ సిబ్బందిని ప్రశ్నించగా.. పృథ్వీ అసలు స్వరూపాన్ని బయటపెట్టేందుకే
ఆమె అలా మాట్లాడిందని వారు చెబుతున్నారు.

మహిళా ఉద్యోగుల ఆరోపణలు :
ఎస్వీబీసీ యూనియన్‌కు బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని,దీనిపై కార్మిక శాఖకు కూడా ఫిర్యాదు చేశామని సిబ్బంది తెలిపారు. పేరు బయటపెట్టడం సమంజసం కాదని.. ఆమె వివరాలు ఎక్కడా చెప్పడం లేదన్నారు. ఎస్వీబీసీలో చాలామంది మహిళలు అతని వల్ల వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. ఏదో ఆర్థిక పరిస్థితులు బాగా లేక.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఉద్యోగాలు చేస్తుంటే.. పృథ్వీ లాంటివాళ్లు తమను వేధించడం దారుణమని అక్కడి మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించి.. అతని రాసలీలలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

పృథ్వీని శిక్షించాలని డిమాండ్ :
పృథ్వీని అసలేం చూసి ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో నియమించారని మహిళా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో భార్యలను వేధించిన కేసులు కూడా అతనిపై ఉన్నాయని, అలాంటి వ్యక్తిని ఆధ్యాత్మిక పదవిలో ఎలా కూర్చోబెట్టారని నిలదీస్తున్నారు. ఓవైపు భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు ఇలా మహిళలను వేధిస్తున్న పృథ్వీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పృథ్వీ భవిష్యత్‌పై జగన్ ఏం డిసైడ్ చేయబోతున్నారు.. :
అమరావతి రైతులపై విమర్శలు చేసి ఇప్పటికే వివాదంలో ఇరుక్కున్న పృథ్వీకి తాజా వివాదం మరిన్ని కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఎస్వీబీసీ సిబ్బంది ఆయనపై చేస్తున్న ఆరోపణలను సీఎం జగన్ ఎలా పరిగణిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పృథ్వీపై వస్తున్న ఆరోపణలపై సీఎం విచారణ జరిపిస్తారా..? లేక చూసీ చూడనట్టే వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే పృథ్వీ వైపు నుంచి కూడా ఈ ఆడియో టేపులపై ఎలాంటి స్పందనా రాలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications