ఇవాళ 12 గంటలకు జరిగేది ఇదేనా ? వైసీపీ, టీడీపీ లీక్స్ తో ఉత్కంఠ..!

ఏపీలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతోంది ? ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ నిన్న విడుదల చేసిన టీజర్లు సాధారణ ప్రజలతో పాటు ఆయా పార్టీల క్యాడర్లలోనూ ఉత్కంఠ పెంచుతున్నాయి. ముఖ్యంగా తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య పేలుతున్న మాటల యుద్ధానికి పరాకాష్టకు తీసుకెళ్లేలా ఇవాళ ఏదో జరగబోతోందన్న ఉత్కంఠ ఓవైపు, అంత సీన్ లేదన్న వ్యాఖ్యలు మరోవైపు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 24 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద విషయం బయటపెడతామంటూ ముందుగా టీడీపీ నిన్న ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్ మొదలైంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఒక్కో స్కాంనూ బయటపెడుతూ వస్తున్న టీడీపీ ఇవాళ వీటన్నింటికీ మించిన అక్రమాన్ని ఏదైనా బయటపెడుతుందన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా విపక్ష నేత జగన్ ను ఇరుకునపెట్టేలా ఆధారాలతో ఏదైనా అంశాన్ని టీడీపీ తెరపైకి తెస్తుందని తెలుస్తోంది.

what will happen 12pm today tension with ysrcp tdp s teasers

అధికార పార్టీ టీడీపీ నిన్న ట్వీట్ పెట్టిన కాసేపటికే విపక్ష వైసీపీ కూడా దాదాపు అలాంటి ట్వీటే పెట్టింది. దీంతో ఉత్కంఠ మొదలైంది. అదీ టీడీపీ చెప్పిన మధ్యాహ్నం 12 గంటలకే అంటూ వైసీపీ కూడా ప్రకటించడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరబోతోంది. కూటమి సర్కార్ అక్రమాలపై గట్టిగా గళం వినిపిస్తున్న వైసీపీ ఇదే క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఏదైనా బిగ్ స్కామ్ ను తెరపైకి తెస్తుందా లేక ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా ఏదైనా పెద్ద అంశాన్ని తెరపైకి తీసుకురానుందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఇరు పార్టీలు కూడా 12 గంటలకు తుస్సుమనిపిస్తాయా అన్న వాదన కూడా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+