రైలు ప్రమాదంపై జగన్: అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదన

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతపురం జిల్లాలో ఈ తరహా రైలు ప్రమాదం ఈ మధ్య కాలంలో మూడోదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిసారీ కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్‌తో పాటు ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రైలు ప్రమాదంలో 30 మందిపైగా గాయపడ్డారు.

when can we put an end to such accidents says ys jagan

రైలు ప్రమాదంపై సోనియాగాంధీ దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం, సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నట్లు సోనియాగాంధీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+