నా బతుక్కి ఢిల్లీ వెళ్లి చెప్పానా, రూ.10 కోట్ల డీల్‌కు నో చెప్పా: ఐటీ రైడ్స్‌పై పవన్
కొవ్వూరు: నేను ముఖ్యమంత్రిని కావాలని అభిమానులు అందరు అరుస్తున్నారని, కానీ జగన్, లోకేష్‌లలా తాను అలా కావాలని కోరుకోవడం లేదని, విధిరాత ఎవరికి తెలుసునని, జగన్ సీఎం కావాలనుకుంటే అయ్యారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొవ్వూరు బహిరంగ సభలో అన్నారు. మన చేతిలో ఉన్నది పోరాటం మాత్రమేనని, సమస్యలపై పోరాడుదామన్నారు. సీఎం కావడం తనకు సరదా కాదన్నారు.
తన ఇంట్లోని నలుగురు పిల్లలను ఏకతాటిపైకి తెచ్చేందుకే నాకు ఇబ్బంది అవుతోందని, అలాంటిది ఇంత పెద్ద బాధ్యత ముళ్లకిరీటం వంటిదని చెప్పారు. ఓ సినిమా హిట్ కాకుంటేనే కొంతమంది తనను తిడతారని, అలాంటితి నేను వచ్చేస్తా.. సీఎం అవుతానంటే కుదరదని చెప్పారు. సీఎం కావడం తనకు లోకేష్‌లా సరదా కాదన్నారు.

నేను సీఎం కావాలని కోరుకోకండి
తన తాత, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ సీఎం కావాలనుకుంటున్నారని, తన తండ్రి సీఎం కాబట్టి జగన్ కావాలనుకుంటున్నారని పవన్ విమర్శించారు. తన తాత పోస్ట్ మ్యాన్ అని, తన తండ్రి పోలీస్ అని నేను కూడా అలా అనుకోవాలన్నారు. అలా అనుకుంటే కుదరదని, ప్రజల కష్టాలు, ఇబ్బందులు తెలియాలన్నారు. నేను సీఎం కావాలని మీరు కోరుకోకండని అన్నారు. నేను సీఎం కావడం కంటే మీరు చైతన్యవంతులు కావాలని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు.

సినిమాల్లో కోట్లు సంపాదించగలను
అభిమానులు, కార్యకర్తలు సమస్యలపై పోరాటం చేయాలని పవన్ సూచించారు. పదిమది ఆకురౌడీలకు భయపడవద్దని, మన ఊర్లో, వీధుల్లో సమస్యలపై పోరాడాలన్నారు. పదవులు అంటే కూర్చోవడం కాదని, పదవిలో కూర్చొని ఏం చేశారనేది ముఖ్యమని చెప్పారు. తాను సినిమాల్లో సంవత్సరానికి వంద కోట్లు సంపాదించగలనని, కానీ ప్రజల ఆవేదన తెలిసినవాడిలా అన్నీ వదులుకొని వచ్చానని చెప్పారు.

మీ మనవడిలా కాదా?
అరకులో ఓ గిరిజన బిడ్డను చూసి కన్నీళ్లు వచ్చాయని, అప్పుడు నా బిడ్డ గుర్తుకు వచ్చిందని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి మనవడిలా ఆ గిరిజన బిడ్డ కాదా అని ప్రశ్నించారు. ఇలా ఉంటే తిరుగుబాటు వస్తుందని చెప్పారు. యువత తప్పుదోవ పట్టడానికి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులే కారణమని చెప్పారు. సమస్యలు తీర్చే శక్తి మీకు లేకుంటే పోటీ చేయవద్దునని సూచించారు.

నా బతుక్కి ఢిల్లీకి వెళ్లి ఐటీ రైడ్స్ చెప్పానట
ఎవరిపైనో ఐటీ దాడులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారని పవన్ విమర్శించారు. ఇంకో మాట.. నేను వెళ్లి ఢిల్లీలో చెప్పానట అన్నారు. నా బతుక్కి.. మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లి రైడ్లు చేయమని చెబుతానా అన్నారు. అసలు ఐటీ రైడ్లు ఎవరి పైన జరుగుతాయని, ఐటీ కట్టని వారిపై జరుగుతాయన్నారు. అన్నీ సరిగ్గా ఉంటే భయమెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అడిగారు. టీడీపీ ఎంపీపై ఇవ్వాల కూడా ఐటీ రైడ్లు జరుగుతున్నాయని తెలిసిందన్నారు.

అడుక్కు తింటా కానీ, ప్రచారం చేయనని చెప్పా
ఓ అల్కాహాల్ సంస్థ పది కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిందని, ప్రచారం చేయమని చెప్పిందని, కానీ తిరస్కరించానని పవన్ చెప్పారు. తాను అడుక్కు తింటానని, కానీ పాడు పనులు మాత్రం చేయనని చెప్పానని అన్నారు. బ్రాండీ తాగమని దరిద్రంగా చెప్పాలా అన్నారు. ఆర్టిస్ట్‌గా నేనే రూ.10 కోట్లు వదులుకున్నానని, మంత్రి జవహర్ మాత్రం బీరులో తక్కువ అల్కాహాల్ ఉంటుంది, మంచిదని చెబుతారా అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications