'ప్రత్యేక' గేమ్: సోనియా సంతకం తీసుకున్న చిరంజీవి (పిక్చర్స్)

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి వేడెక్కింది. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గొంతెత్తింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బిజెపి, టిడిపిలపై ధ్వజమెత్తారు.

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన ఇతర హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ బుధవారం నాడు తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించనున్నారు. విభజన హామీలతో పాటు ప్రధానంగా ప్రత్యేక హోదా అంశాన్ని అధికార, విపక్షాలు ప్రస్తావించాయి.

మంగళవారం నాడు ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ, లోకసభలో వాడిగావేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాము హామీ ఇచ్చామని, నెరవేర్చాలని కాంగ్రెస్ చెబుతుండగా, చట్టంలో హోదా పెట్టలేదని, అది మీ వైఫల్యమేనని, అయినా తాము ప్రయత్నిస్తున్నామని బిజెపి చెబుతోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

రాష్ట్ర విభజన నేపథ్యంలో.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చుక్కలు చూపించారు. కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మేల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

విభజనతో తెలంగాణ, ఏపీలలో లబ్ధి పొందుదామనుకొని రెండు రాష్ట్రాలలోను కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. తెలంగాణలో పరువు దక్కించుకున్నప్పటికీ.. ఏపీలో పూర్తిగా నష్టపోయింది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఇప్పుడు ఏపీలో పట్టు సాధించుకునే ఉద్దేశ్యంలో భాగంగా... కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పేరుతో మరో పొలిటికల్ గేమ్‌కు తెరలేపిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

తాము ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నామని, నెరవేరుస్తామని చెప్పినప్పటికీ రాద్దాంతం చేయడం ఏమిటని బిజెపి మండిపడుతోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన సమయంలోనే... ఏపీ శాసన సభ ప్రత్యేక హోదా, ఇతర హామీల కోసం శాసన సభలో తీర్మానం చేసింది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఏపీకి తాము ప్రత్యేక హోదాతో పాటు చాలా హామీలు ఇచ్చామని, అందులో చాలా శాతం నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ బిజెపిపై నిప్పులు చెరుగుతోంది. దీనికి బిజెపి కూడా ధీటుగానే స్పందిస్తూ... ఏమేం ఇచ్చామో చెప్పే ప్రయత్నం చేసింది.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరించింది. ఇందులో భాగంగా సోనియా సంతకం తీసుకుంటున్న చిరంజీవి. చిరంజీవి, మన్మోహన్, రాహుల్ గాంధీ సంతకాలు కూడా తీసుకున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో కాంగ్రెస్ 'ప్రత్యేక' పోరు

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసింది. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

ఏపీకి ప్రత్యేక హోదా అంశం చట్టం చేయలేదని, అయినప్పటికీ తాము దానికి కట్టుబడి ఉన్నామని, దానిని నెరవేర్చుతామని బిజెపి నేతలు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు, జగన్

చంద్రబాబు నాయుడు, జగన్

హోదా కోసం కాంగ్రెస్ నేతల ధర్నా, బిజెపి నేతల ఘాటు స్పందన, మరోవైపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక హోదా, ఇతర హామీల కోసం తీర్మానం నేపథ్యంలో మరోసారి ఈ అంశం వేడెక్కింది. ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీరు తీసుకు వచ్చారన్న వ్యాఖ్యలకు బిజెపి ధీటుగా స్పందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+