'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్‌లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అంశాలు లేవని, ఇది చాలా దారుణమని వైసిపి నేత పార్థసారథి అన్నారు.

విజయవాడ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అంశాలు లేవని, ఇది చాలా దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి బుధవారం అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. ఏపీని పట్టించుకోవాలన్న తమ ఉద్దేశ్యం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు.

 Where is Vishaka railway zone and Amaravati connecitivity in Budget?

ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల చెవులలో పూవులు పెట్టారని ఎద్దేవా చేశారు. జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి హోదా ప్రస్తావన లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పట్టించుకోవాలన్నారు.

విశాఖకు రైల్వే జోన్, అమరావతి కనెక్టివిటీ గురించి ప్రస్తావన లేదని పార్థసారథి అన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+