నిరసన: నల్లజెండాలు ఎగురవేసిన కోదండరాం, నాయిని

While Andhra celebrates, Telangana activists mark ‘black day
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ నగరంలోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ రాజకీయ జెఏసి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లజెండా ఎగురవేయడానికి నాయకులు, ఉద్యోగులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో జెఏసి ఛైర్మన్ కోదండరాం జెఏసి జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిరసన దినంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడే వరకు అప్రమత్తంగా ఉంటామని కోదండరాం చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుుపుకుంటామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని కోదండరాం తెలిపారు.

తెలంగాణ‌భవన్‌, ఓయూలో నల్ల జెండాలు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం నల్ల జెండా ఎగురవేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ వర్సిటీ విద్యార్థులు రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ విద్యార్థులు శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేశారు.

ఈ సందర్భంగా తెలంగాణకు మద్దతుగా వారు నినాదాులు చేశారు. కాగా తెలంగాణ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు నల్లరంగు టీ షర్టులు ధరించి తెలంగాణ ఐటీ అసోసియేషన్ నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తలా పిలుపునిచ్చారు. సైబర్ టవర్స్ నుంచి ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో కూడా నిరసన దినం సందర్భంగా నాయకులు నల్ల జెండాలు ఎగురవేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+