వచ్చి చూడండి: విదేశీ దౌత్యవేత్తలతో బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: భారతదేశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ రాయబారులకు పిలుపు ఇచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న విదేశీ రాయబారుల సమావేశంలో చంద్రబాబు మంగళవారం ప్రత్యేక ప్రజెంటేషన్ చేశారు. రాష్ట్రానికి వచ్చి అవకాశాలను స్వయంగా తెలుసుకోవాలని సూచించారు.
భారత దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు, ప్రతిఫలాల గురించి ఆయన విదేశీ రాయబారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను ఇటీవల మూడు దేశాల్లో పర్యటించానని చెప్పారు. ఈ మూడు దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పట్టేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు.
అభివృద్ధికి రాయబారులు అనే అంశంపై చంద్రబాబునాయుడు ప్రసంగించారు. భారతదేశం అత్యంత వేగంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి మౌలికసదుపాయాలున్నాయన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు మిషన్స్, ఐదు గ్రిడ్స్, ఐదు క్యాంపెయిన్స్ కొనసాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలుంటాయని రాయబారులకు హామీ ఇచ్చారు.

చంద్రబాబు
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పిలుపునిచ్చారు.

చంద్రబాబు
భారతదేశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ రాయబారులకు పిలుపు ఇచ్చారు.

చంద్రబాబు
విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న విదేశీ రాయబారుల సమావేశంలో చంద్రబాబు మంగళవారం ప్రత్యేక ప్రజెంటేషన్ చేశారు.

చంద్రబాబు
భారత దేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు, ప్రతిఫలాల గురించి ఆయన విదేశీ రాయబారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

చంద్రబాబు
తాను ఇటీవల మూడు దేశాల్లో పర్యటించానని చెప్పారు. ఈ మూడు దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పట్టేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు.

చంద్రబాబు
అభివృద్ధికి రాయబారులు అనే అంశంపై చంద్రబాబునాయుడు ప్రసంగించారు. భారతదేశం అత్యంత వేగంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మంచి మౌలికసదుపాయాలున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నదన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు మిషన్స్, ఐదు గ్రిడ్స్, ఐదు క్యాంపెయిన్స్ కొనసాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలుంటాయని రాయబారులకు హామీ ఇచ్చారు.

చంద్రబాబు
చంద్రబానాయుడు ఈ తరువాత ఏపిభవన్‌లో ఎన్టీపీసీ చైర్మన్ అరుణ్‌రాయ్ చౌదరితో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులను సమీక్షించారు.

చంద్రబాబు
ఎన్‌టిపిసి నిర్మిస్తున్న సింహాద్రి థర్మల్ కేంద్రం, అనంతపురంలో చేపట్టిన 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు, పూడిమడక థర్మల్ కేంద్రం నిర్మాణం పనులను సమీక్షించారు.

చంద్రబాబు
తదుపరి ఏపీ భవన్ ఉద్యోగులు ముఖ్యమంత్రిని కలిసి 43 శాతం ఫిట్‌మెట్ ఇవ్వాలని నిర్ణయించినందుకు తమ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications