TDPలో చేరే YCP ఎమ్మెల్యేలెవరు?
ఏపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం సంక్రాంతి బరిలో కోడిపుంజుల్లా తలపడుతున్నాయి. కచ్చితంగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి జగన్, ఈసారి అధికారంలోకి రావాల్సిందేననే లక్ష్యంతో చంద్రబాబు తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

ఆనం ధిక్కార స్వరం
ఇటీవలి కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన కుమార్తె కైవల్యారెడ్డి ఒంగోలు మహానాడు సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేతలను కలిసింది. ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్ అడగటానికే కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే ఆనం స్పందించారు. తమ కుమార్తె వివాహం చేసుకున్న కుటుంబమంతా టీడీపీ నాయకులవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారని, అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు.

ప్రాధాన్యత దక్కడంలేదని కినుక
సీనియర్ రాజకీయవేత్తగా పార్టీలో తనకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కకపోవడంతో కొన్నాళ్ల నుంచి ఆయన కినుక వహించారు. ప్రభుత్వంపైనే నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దీంతో రానున్న ఎన్నికల్లో దాదాపుగా ఆనంకు సీటు దక్కడం అనుమానేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయడానికి ఆనం అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే నేరుగా పార్టీపై విమర్శలు సంధిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జగన్ చేత పార్టీ నుంచి బయటకు పంపించేసుకొని సానుభూతి పొందడానికే ఆనం ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

వసంత కృష్ణప్రసాద్ సంగతి..?
కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు, మంత్రి జోగి రమేష్ కు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎన్నారైలను భయపెడితే సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరూ ముందుకు రారంటూ ఉయ్యూరు శ్రీనివాసరావు విషయంలో టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబుపై ఏనాడూ విమర్శలు చేయనని గతంలోనే ప్రకటించారు. వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు, ఆయన వైఖరి టీడీపీలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వైసీపీ మాజీ మంత్రి మేకతోటి సుచరిత.. ''తన భర్త పార్టీ మారుతున్నాను.. నువ్వు కూడా రా.. అంటే వెళ్లక తప్పదుకదా'' అని వ్యాఖ్యానించారు. దయాసాగర్ చేరే పార్టీలోనే సుచరిత కూడా చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక స్పష్టత వచ్చింది. ఆనం రామానారాయణరెడ్డి, వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మేకతోటి దయాసాగర్ జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ వీటిపై ఒక స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

Click it and Unblock the Notifications