పవన్ చేతిలో కీలుబొమ్మ, ఎవరో చెప్పు: కిషన్‌పై హరీష్
మెదక్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి కీలుబొమ్మ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం విమర్శించారు.
మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని నడిపిస్తోంది.. కిషన్ రెడ్డియా లేక చంద్రబాబు చెప్పాలని మండిపడ్డారు.
సమైక్యవాది అయిన జగ్గారెడ్డికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయన మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పైన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

జగ్గారెడ్డి అరెస్ట్ వారెంట్ ఉపసంహరణ
మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి పైన ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును కోర్టు ఉపసంహరించుకుంది. ఈ నెల 18వ తేదీన హాజరు కావాలని కోర్టు జగ్గారెడ్డిని ఆదేశించింది.
తెరాసను గెలిపించాలని గుండా మల్లేష్
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని సీపీఐ నేత గుండా మల్లేష్ పిలుపునిచ్చారు. తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అదిలాబాద్ జిల్లాలో విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications