'రాజధాని అమరావతి' కోసం మంత్రి పదవిని పోగొట్టుకున్నదెవరు??
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత మంత్రి పదవిని దక్కించుకున్న వ్యక్తి కేవలం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకోవడంవల్లే తన పదవిని కోల్పోయారా? ఎక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు? ఏ శాఖకు మంత్రి పదవిని నిర్వర్తించారు? అనే చర్చ ఇప్పుడు ఏపీలో ఎక్కువగా నడుస్తోంది. ప్రముఖ రచయిత కందుల రమేష్ రాజధాని అమరావతి గురించి 'అమరావతి వివాదాలు - వాస్తవాలు' పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే కార్యక్రమానికి హాజరైన అమరావతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు ఒక విషయం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యచకితుల్నిచేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు మూడు సంవత్సరాలు పూర్తికావస్తున్న తరుణంలో మంత్రి వర్గాన్ని మార్చిన సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణాల సమతూకంలో భాగంగా ఆయన కొందరిని మార్చినప్పటికీ కొందరు మాత్రం మంత్రులుగా కొనసాగుతున్నారు. డాక్టర్ శ్రీనివాసరావు చెప్పినదాని ప్రకారం.. సదరు మంత్రి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమలకు వెళ్లారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన సన్నిహితుల్లో ఒకరు ఏం మొక్కుకున్నావని అడిగారు. దానికి ఆ మంత్రి చెప్పిన సమాధానం.. అమరావతి రాజధానిగా ఉండాలని మొక్కుకున్నాను అన్నారు. తాజాగా ఈ విషయాన్ని కొలికపూడి వెల్లడించారు. ఆయన ఈ విషయం చెప్పేటప్పుడు వేదికపై చంద్రబాబు కూడా ఉన్నారు. ఆయన చెప్పేదిసావధానంగా విన్నారు. అదే సమయంలో కొలికపూడి ఒక క్లూ కూడా ఇచ్చారు. సదరు మంత్రి చంద్రబాబును బాగా విమర్శించేవారని చెప్పారు. ఇప్పుడు ఎవరై ఉంటారా? అనేదే హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications