సీఎం జగన్ సూచించారా - చిరంజీవి ఎంపిక చేసారా : చర్చల టీం సెలక్షన్ వెనుక..ఇదీ లెక్క..!!
సీఎం జగన్ ఏం చేసినా దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాని వెనుక అనేక లెక్కలు ఉంటాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సమస్యల పైన చర్చల కోసం చిరంజీవి టీం సీఎం క్యాపు కార్యాలయానికి చేరుకుంది. అయితే, గతంలో చిరంజీవి టీంలో నాగార్జునతో పాటుగా దర్శక - నిర్మాతలు మాత్రమే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. కానీ, ఈ సారి అనూహ్యంగా హీరోలు మహేష్ బాబు - ప్రభాస్ సైతం హాజరయ్యారు. అయితే, జనవరి నెలలో చిరంజీవి అమరావతిలో సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో తనను ఒక్కడినే సీఎం ఆహ్వానించారని..అందుకే తానొక్కిడినే వచ్చానంటూ పదే పదే చెప్పుకొచ్చారు.
Recommended Video

చర్చల టీం ఎంపిక సమీకరణాలు
తరువాతి సమావేశానికి సీఎం నుంచి ఎవరికి ఆహ్వానం వస్తే వారు హాజరవుతారని వివరించారు. అయితే, కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ నుంచి గన్నవరం బయల్దేరే సమయంలోనూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో ఎవరు వస్తున్నారో తనకు తెలియదని..మీడియాలో వస్తున్న పేర్లే తాను వింటున్నానని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఈ టీం లో నాగార్జున లేరు.
అమలకు కరోనా రావటంతో..నాగార్జున ఈ టూర్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభాస్ - మహేష్ బాబు ఎంపిక ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. చిరంజీవి - సీఎం జగన్ భేటీ పైన మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో జరిగిన సమావేశం చిరంజీవి - సీఎం జగన్ పర్సనల్ అంటూ వ్యాఖ్యానించారు.

సీఎం సూచించారా - చిరంజీవి ఎంపిక చేసారా
ఛాంబర్ నుంచి ప్రతినిధులు హాజరై సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారంటూ చెప్పుకొచ్చారు. దీంతో..మోహన్ బాబు ..ఆయన మద్దతు దారుల నుంచి విమర్శలకు అవకాశం లేకుండా మంచు కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మహేష్ బాబు బావ జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు.
మహేష్ బాబు ఫ్యామిలీకి హైదరాబాద్ లో స్టూడియోలు ఉన్నాయి. ఏపీలోనూ సినీ పరిశ్రమ విస్తరించాలని సీఎం జగన్ సూటిగా సినిమా పెద్దలను కోరనున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే..సినిమా వ్యాపార విస్తరణకు మహేష్ సిద్దంగా ఉన్నారని ప్రచారం. ఇక, ప్రభాస్ ఎంపిక సైతం వ్యూహాత్మకంగానే జరిగిందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

ఆచితూచి ఎంపిక వెనుక..
ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు "మా" క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ గా ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటుగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా పూర్తి చేసారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి... మరో దర్శకుడు కొరటాల శివ సైతం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళికి సినీ రిలేషన్ మాత్రమే కాకుండా... ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. ఇక, ఏపీలో సినీ సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్న సీఎం జగన్.. అదే సమయంలో పరిశ్రమలోని ముఖ్యులు ఇండస్ట్రీని ఏపీలో విస్తరించే అంశాల పైన చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రీ లేదా పోస్టు ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలని... దీంతో పాటుగా ఏపీలో షూటింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ కోరనున్నట్లు సమాచారం.

సీఎం జగన్ లెక్క పక్కా..
లొకేషన్ ఫీజులను సైతం మినహాయింపు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక, విశాఖ కేంద్రంగా స్టూడియోల నిర్మాణం పైన చర్చకు రానుంది. ఇందుకు మెగా ఫ్యామిలీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..పరిశ్రమ ఏం కోరుకుంటోందో అది ఇవ్వటానికి సిద్దంగా ఉన్న జగన్... అదే సమయంలో పరిశ్రమ నుంచి ఏపీకి ప్రయోజనం - గుర్తింపు ఉండాలనే కోణంలో చర్చలు చేస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అందులో భాగంగానే ఫిలిం ఛాంబర్.. నిర్మాతల కౌన్సిల్... "మా"..వంటివి ఉన్నా... ఏరి కోరి కొందరు ప్రముఖులతోనే ఈ చర్చలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మలి విడత చర్చల్లో మరి కొందరికి ఆహ్వానాలు ఉంటాయని..అవి ఏపీలో ఇండస్ట్రీ విస్తరణ ప్రధాన అంశంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు చిరంజీవి టీం ఎంపిక పైన మాత్రం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ మొత్తానికి ఈ సమావేశం తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications