చంద్రబాబు- ప్రశాంత్ కిషోర్ మధ్య మీడియేటర్ ఎవరు?

Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

Who were participated in meeting between Chandrababu Naidu and Prashant Kishor

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. శనివారం సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య సుమారు మూడు గంటలకు పైగా సాగింది. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రశాంత్ కిశోర్.. విజయవాడకు రావడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్- స్పెషల్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేశారు. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడలో అడుగుపెట్టారు. ప్రశాంత్ కిశోర్‌తో పాటు నారా లోకేష్, శంతను సింగ్, టీడీపీ నేత కిలారు రాజేష్, ఎం శ్రీకాంత్.. ఈ ఫ్లైట్‌లో వచ్చారు.

ప్రశాంత్ కిషోర్ అంటే తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పడదు. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేయడమే దీనికి కారణం. చంద్రబాబు, నారా లోకేష్ మొదలుకుని తెలుగుదేశం పార్టీలో కిందిస్థాయి కార్యకర్త వరకూ గతంలో ప్రశాంత్ కిశోర్‌పై ఘాటు విమర్శలు చేసిన వారే.

అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు స్వయంగా.. తన ఇంటికి ఆహ్వానించడం, దీనికోసం తనయుడు లోకేష్‌ను ఎస్కార్ట్‌గా పంపించడం హాట్ డిబేట్‌గా మారింది. సీఎం రమేష్ తన పలుకుబడిని ఉపయోగించి మరీ ప్రశాంత్ కిశోర్‌ను చంద్రబాబు ఇంటి వరకూ తీసుకుని రాగలిగారనేది వైఎస్ఆర్సీపీ చేస్తోన్న ఆరోపణ.

బీజేపీ నేత అయివుండీ చంద్రబాబు కోసం సీఎం రమేష్ కష్టపడుతున్నాడని, తన సొంత పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి బదులుగా టీడీపీ కోసం పని చేస్తోన్నాడనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇది బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తెలియకుండా జరిగి ఉండదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+