వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ డెయిరీ భవితవ్యం: చైర్మన్‌గా మండవ వారసులెవ్వరు?

జయ డెయిరీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన మండవ జానకీ రామ్ గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతి శూన్యమని విమర్శలు వినిపిస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయ డెయిరీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన మండవ జానకీ రామ్ గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతి శూన్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ డెయిరీ అనేక ఆటుపోట్లను, ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది.

పాలను ఉత్పత్తి చేయలేక, బయట నుంచి భారీగా పాలను కొనుగోలు చేసి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. నవ్యాంధ్రలో పాడి రైతుల వికాసం కోసం పాడిని పెంపొందించడం కోసం ఉత్పత్తి గణనీయంగా పెంచడం విజయ డెయిరీ ప్రధాన విధి అని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ఆ తర్వాతే డెయిరీ వ్యాపార అంశం ముందుకు రావాలి. దీనికి భిన్నంగా ఏడాది నుంచి అరువు పాలతో విజయ డెయిరీ వ్యాపారం చేస్తున్నది. దాదాపు లక్ష లీటర్ల పాలు బయట నుంచి కొనుగోలు చేసి వ్యాపారం సాగిస్తున్నది. గతంలో ఎంతో చరిత్ర గల విజయ డెయిరీకి ఇంతటి దుస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ వాసులు ఏనాడూ కలలో కూడా ఊహించలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసే ఉంటే క్రుష్ణా జిల్లాలో పశు ఉత్పత్తి గణనీయంగా పెంచడం ద్వారా పాల దిగుబడి పెరిగేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

త్వరలో తేలనున్న విజయ డెయిరీ భవితవ్యం

త్వరలో తేలనున్న విజయ డెయిరీ భవితవ్యం

రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీ ద్వారా అల్పాదాయ వర్గాల వారికి నెలకు రూ.10 వేల లోపు ఆదాయం సమకూర్చాలని భావిస్తున్నది. ఈ నెలలో సంస్థ ముగ్గురు డైరెక్టర్లు నరసింహరావు, వెంకటేశ్వర రావు, సాయిబాబు ఐదేళ్ల పదవీ విరమణ చేయనున్నారు. విజయ డెయరీపై అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్నది. గతేడాది జరిగిన పాలక మండలి సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్, పాలక మండలి డైరెక్టర్లను కూడా పార్టీయే నిర్ణయిస్తుందని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఈ నెల 30న బోర్డు పాలక వర్గం సమావేశమై కొత్త పాలక వర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు తేదీ ఖరారు చేయనున్నది. పాలక వర్గంలో దీంతో విజయ డెయిరీలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో కిందటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పినట్లు తెలుగుదేశం పార్టీయే నూతన బోర్డు డైరెక్టర్లను నియమిస్తారా? లేదా? అన్న విషయం మున్ముందుగానీ తేలదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

25 ఏళ్ల రికార్డు కోసమే జానకీరాంకు గడువు

25 ఏళ్ల రికార్డు కోసమే జానకీరాంకు గడువు

అయితే పార్టీలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికపై వివాదం నెలకొన్నదని సమాచారం. మరో ఏడు నెలల పాటు చైర్మన్‌గా కొనసాగితే విజయ డెయిరీ చైర్మన్‌గా మండవ జానకీ రామయ్య ఆ పదవిలో 25 ఏళ్లు ఉన్న రికార్డు సాధిస్తారనే గత ఏడాది మరో ఏడాది పదవిలో కొనసాగేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతున్నందున చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియ త్వరలో జరుగనున్నది. బోర్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆధిపత్యం కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు రెండు దశాబ్దాలుగా విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికపై ఏనాడూ పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. డెయిరీలో మండవ జానకీరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియంత్రుత్వ పోకడలతో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన డైరెక్టర్లు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన బోర్డు డైరెక్టర్లు, చైర్మన్ ఎంపిక తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే సాగుతుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

దాసరి, చలసానిల్లో ఎవరిని వరించేనో?

దాసరి, చలసానిల్లో ఎవరిని వరించేనో?

విజయ డెయిరీ చైర్మన్ రేసులో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, రైతు నాయకుడు చలసాని ఆంజనేయులు పోటీ పడుతున్నారు. దాసరి బాలవర్ధన రావును డెయిరీ చైర్మన్‌గా చేయడం కోసం బోర్డు డైరెక్టర్‌గా అవకాశం కల్పించినా.. ఆ అవకాశం ఆయనకు లభించలేదు. ప్రస్తుతం ఆయన విజయ డెయిరీ బోర్డు డైరెక్టర్‌గా నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అయితే ఆయనకు ఒక్క ఏడాది మాత్రమే డైరెక్టర్‌గా పదవీ కాలంలో ఉన్న ఆయన చైర్మన్ అయితే ఏడాది పాటే ఉంటారు. కిందటి ఏడాది రైతు నాయకుడు చలసాని ఆంజనేయులు తెర మీదకు వచ్చారు. పార్టీ తరఫున రావడంతో డైరెక్టర్‌గా ఆంజనేయులు ఎన్నిక అయ్యారు

ఇలా జరిగింది...

ఇలా జరిగింది...

పార్టీ తరఫున బోర్డు డైరెక్టర్‌గా బాల వర్ధన్ రావు ఎన్నికయ్యే అవకాశం లేకుంటే చలసానికి అవకాశం కల్పించినా చుక్కెదురైంది. దీంతో పార్టీ నాయకత్వం పట్ల విధేయతతో వ్యవహరించే ఆంజనేయులుకు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. వీరిలో ఎవరికీ విజయ డెయిరీ చైర్మన్‌గా ఎవరినీ ఎన్నుకుంటారో, పార్టీ నాయకత్వం ఎవరిని డైరెక్టర్లుగా నియమిస్తారో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే మరి.

English summary
In Krishna district there discussion that who will take chair of Vijaya Diary chairman post. Present Chairman Mandava Janaki Ram term over and 3 directiors will be retired end of this month. Board will decide when conduct elections of Vijaya Diary Board. AP CM Chandrababu already told last year that TDP High command will decide who will Vijaya Diary chairman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X