వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతబాబుకు ముగిసిన రిమాండ్-బెయిలా ? జైలా ? కస్టడీ కోరని పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య వ్యవహారంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇంకా పూర్తి వివరాలు సేకరించలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఇప్పటివరకూ కస్టడీలోకి తీసుకోలేదు. మరోవైపు ఆయన రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండటంతో కోర్టులో హాజరుపర్చబోతున్నారు.

 నత్తనడకన దర్యాప్తు

నత్తనడకన దర్యాప్తు

ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. కారు డ్రైవర్ హత్య కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా పెళ్లిళ్లకు హాజరవుతున్నా తొలుత పట్టించుకోని పోలీసులు.. అనంతరం విమర్శలతో ముందుకు కదిలారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతినీ పోలీసులు బయటపెట్టలేదు. దీంతో దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.

 కస్టడీ కోరని పోలీసులు

కస్టడీ కోరని పోలీసులు

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీ కోరే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఆ అవకాశాన్ని ఇప్పటికీ వాడుకోలేదు. అనంతబాబుకు ఇచ్చిన రెండు వారాల రిమాండ్ పూర్తయినా ఇంకా పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. దీంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ అయిన అనంతబాబు విషయంలో పోలీసులు ఎందుకు ప్రేమ చూపుతున్నారన్న అనుమానాలు సాగుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం జైల్లో అనంతబాబుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు.. కస్టడీ కూడా కోరకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అనంతబాబుకు జైలా ? బెయిలా

అనంతబాబుకు జైలా ? బెయిలా

అనంతబాబుకు కోర్టు విధించిన రెండు వారాల రిమాండ్ పూర్తి కావడంతో ఇవాళ పోలీసులు కోర్టులో తిరిగి హాజరు పర్చబోతున్నారు. ఈ రెండు వారాల్లో పోలీసులు కస్టడీ కూడా కోరలేదు. మరోవైపు అనంతబాబు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి కోర్టు బెయిల్ ఇస్తే అనంతబాబుకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. అలా కాకుండా పోలీసులు ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని కోర్టును కోరితే మాత్రం రిమాండ్ లేదా కస్టడీకి ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో అనంతబాబు బెయిల్ పైనా సస్పెన్స్ నెలకొంది.

English summary
mlc anantha babu's judicial remand has been concluded today and police to submit him in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X