ఇప్పుడేం చెబుతారు?- ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్
అమరావతి: వలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం కొనసాగుతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కొన్ని రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ- అటు పవన్ కల్యాణ్ గానీ, జనసేన పార్టీ గానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వలంటీర్ల వ్యవస్థపై తమ దాడిని కంటిన్యూ చేస్తోన్నారు.
వలంటీర్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా గతంలో ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

అదే సమయంలో- ఏపీలో మహిళలు అదృశ్యం అవుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. ఏపీలో 2019 నుంచి 2021 వరకు ఏపీ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు మిస్ అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇవ్వాళ రాజ్యసభలో లిఖితపూరక సమాధానం ఇచ్చారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 7,918 మంది బాలికలు,18 ఏళ్లు పైబడిన 22,278 మంది మహిళలు ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో అదృశ్యం అయ్యారని కేంద్ర మంత్రి తెలిపారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీలో మహిళలు అదృశ్యం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
The Minister of State for Home Affairs, Shri Ajay Kumar Mishra, in a written reply to a question in the Rajya Sabha answered the following today.
— Pawan Kalyan (@PawanKalyan) July 26, 2023
During the 3 years from 2019 to 2021, a total of 30,196 females from Andhra Pradesh which includes (7918 girls below 18 years) and…
ఇదే విషయాన్ని తాను గతంలో ప్రస్తావిస్తే ఎదురు దాడికి దిగిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఏపీలో తప్పిపోయిన బాలికలు మహిళల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. వారందరూ ఎందుకు తప్పిపోతున్నారు?, వారికి ఏమి జరుగుతోంది?, దీనికి ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు.
ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి.. దీనిపై బహిరంగంగా వివరణ ఇవ్వగలుగుతుందా? అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఏపీ మహిళా కమిషన్, హోం మంత్రిత్వ శాఖ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు వివరణ కోరుతుందా? అని ప్రశ్నించారు. దీనిపై హోమ్ శాఖ మంత్రి, డీజీపీ స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications