చంద్రబాబుకూ, బీజేపీకీ ఎక్కడ చెడింది ? అమిత్ షాతో చర్చల నుంచి జైలు వరకూ..!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ జరిగిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగబోతోంది ? ఇది తెలుసుకోవాలంటే అంతకుముందు ఏం జరిగిందన్న దాన్ని నిశితంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో విభేదించి బయటికి వచ్చేసి పోరాటాలు చేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. అంతే కాదు తిరిగి బీజేపీ సాయం తీసుకోవాల్సిందేనన్న అంచనాకు వచ్చేశారు. కానీ నాలుగేళ్లుగా ఈ విషయాన్ని నాన్చిన బీజేపీ... ఈ ఏడాది మాత్రం ఆయనకు ఊరటనిచ్చే ప్రయత్నాలు చేసింది.

నీతి ఆయోగ్, రాజకీయ పార్టీల అధినేత భేటీల పేరుతో ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ భేటీ అయితే.. ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబును రహస్యంగా పిలిపించుకుని అమిత్ షా భేటీ అయ్యారు. అదే సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, అనేక కీలక బిల్లుల విషయంలో చంద్రబాబు కేంద్రానికీ అండగా నిలిచారు. దీంతో బీజేపీ-టీడీపీ తిరిగి పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంతా భావించారు. ముందు తెలంగాణలో పొత్తు పెట్టుకుని అనంతరం ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారనే సంకేతాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా పరిస్ధితి మారిపోయింది.

why bjp supports ys jagans fight against chandrababu ?

తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన ప్రకటన బీజేపీతో ఆయనకు పెరిగిన దూరాన్ని సూచించింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబుతో పొత్తుపై ప్రకటన చేసేందుకు బీజేపీ ముందుకు రాకపోవడం, సీట్ల కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు పైచేయి ఉండాలని కోరుకోవడంతో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. చివరకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు, మద్దతుకు టీడీపీ ఆశలు వదిలేసుకుంది. ఇది అక్కడితో ఆగలేదు. ఏపీలో ఇన్నాళ్లూ తమకు మద్దతుగా ఉన్న వైసీపీని కాదని టీడీపీతో వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని భావించింది.

అయితే చంద్రబాబు మరదలు అయిన పురందేశ్వరిని ఏపీ బీజేపీ ఛీఫ్ గా ప్రకటించగానే వైసీపీ మండిపడింది. చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని పలు సందర్భాల్లో తప్పుబట్టింది. అయితే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ ఛీఫ్ గా నియమించడం వెనుక అమిత్ షా వ్యూహం వేరే ఉంది. రాష్ట్రంలో బలంగా కనిపిస్తున్న వైసీపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేసే పరిస్ధితి లేదు, చేసినా ఫలితం గ్యారంటీ లేదు. దానికి బదులు బలహీనంగా ఉన్న చంద్రబాబునే టార్గెట్ చేస్తే ఏపీ రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడుతుంది. అందులోకి పురందేశ్వరిని పంపడం ద్వారా సత్తా చాటుకోవచ్చనే లెక్కలు వేసుకుంటోంది.

దీంతో ఓవైపు పురందేశ్వరిని ప్రోత్సహిస్తూనే, మరోవైపు చంద్రబాబుపై వైఎస్ జగన్ దూకుడుకు మద్దతుగా నిలవడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జగన్ కూ కావాల్సింది అదే. రాష్ట్రంలో టీడీపీ ప్రత్యర్ధిగా ఉండటం కంటే బీజేపీ ఉంటే మరో రెండు దఫాలు సులువుగా అధికారంలోకి రావొచ్చనే అంచనాల్లో వైసీపీ ఉంది. దీంతో చంద్రబాబుపై వైఎస్ దూకుడుకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న బీజేపీ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై కేంద్ర దర్యాప్తు సంస్ధల్ని పంపింది. తద్వారా వైఎస్ జగన్ కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ ఇంత దూకుడుగా చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+