దావోస్ కు పవన్ ను తీసుకువెళ్ళనిది అందుకే కదా చంద్రబాబు.. మాజీమంత్రి రోజా సూటిప్రశ్న!

ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తెచ్చిపెట్టిందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెబుతుంటే చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అని వైసిపి నాయకురాలు మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. వట్టి చేతులతో తిరిగి వస్తున్నారని రోజా విమర్శించారు.

రెడ్ బుక్ రాజ్యాంగంతో భయపడి పెట్టుబడిదారులు రావట్లేదు: రోజా
నేడు నగరిలో మీడియాతో మాట్లాడిన రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే పక్కనున్న రాష్ట్రాలకు భారీ పెట్టబడులు వచ్చాయని కానీ చంద్రబాబు కట్టుకథలు చెబుతూ ఏపీకి తిరిగి వస్తున్నారని ఆరోపించారు. దావోస్ లో చంద్రబాబు పెట్టుబడిదారులను మభ్య పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదని రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో భయపడి పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంలేదని రోజా పేర్కొన్నారు.

Why Chandrababu did not take Pawan to Davos Former Minister Roja direct question

దావోస్ కు పవన్ కళ్యాణ్ ను ఎందుకు తీసుకువెళ్లలేదో?
దావోస్ పర్యటన పేరుతో ప్రత్యేక విమానాలు సూట్లు, బూట్లు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చంద్రబాబు బృందం ఎటువంటి ఫలితం సాధించలేక పోయిందని ఎద్దేవా చేశారు. ఇక దావోస్ కు పవన్ కళ్యాణ్ ను ఎందుకు తీసుకువెళ్లలేదో చెప్పాలని మంత్రి రోజా ప్రశ్నించారు. అక్కడకు పవన్ వెళ్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని భయపడి తీసుకువెళ్లలేదని మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.

కక్ష సాధింపు చర్యలతో పెట్టుబడిదారులు వెనక్కు
వైయస్ జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో పెట్టుబడులు దండిగా వచ్చాయని రోజా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతుండడంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అంటూ నిలదీశారు.

జగన్ పాలనలోనే మూడు పోర్టుల పనులు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం, మూల పట్నం, రామాయపట్నం మూడు పోర్టుల పనులు చేపట్టారని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను జగన్ హయాంలోని 35 శాతం పూర్తి చేశారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. గత జగన్ పాలనలో మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారన్నారు.

జగన్ ను చూసి అదానీ, అంబానీ వస్తే .. చంద్రబాబును చూసి ఎవరొచ్చారు
వైఎస్ జగన్ ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వచ్చారని, చంద్రబాబు పాలనలో ఒక్కరైనా ఏపీ ముఖం చూసారా అని ప్రశ్నించారు ఇక చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+