'హైద్రాబాద్‌లో ఉన్నా: బాలకృష్ణకి బాబు ఫస్ట్‌ర్యాంక్ వెనుక!', సీమ ద్రోహి: అనంత

అనంతపురం: ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణకు మొదటి ర్యాంక్ ఇవ్వడం పైన సిపిఎం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ ఎద్దేవా చేశారు.

బాలకృష్ణకు మొదటి ర్యాంగ్ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలోని హైదరాబాదులో నివాసం ఉంటున్న బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంగ్ ఇవ్వడమా, ఈ ర్యాంకులు అన్నీ బోగస్ అన్నారు. తన ముఖ్యమంత్రి పదవికి బాలకృష్ణ అడ్డు వస్తాడనే భయంతోనే మొదటి ర్యాంక్ ఇచ్చారని విమర్శించారు.

డబ్బులు లేవంటూనే గోదావరి పుష్కరాలకు రూ.1500 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. కాగా, ఏపీ ప్రభుత్వం పని తీరు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా సర్వే చేయించింది. దీని ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో బాలకృష్ణకు మొదటి ర్యాంక్ వచ్చింది.

Why Chandrababu gave first rank to Balakrishna?

చంద్రబాబు రాయలసీమ ద్రోహి: అనంత

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి సోమవారం మండిపడ్డారు. కరువు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చాలామంది వలస వెళ్తున్నారని, అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మొటి దశ కింద జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న డిమాండుతో సోమవారం ఉరవకొండలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు 80 టిఎంసీలు నీటిని తరలిస్తున్నారని, అలాంటిది శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తూ ఎందుకు జీవో జారీ చేయడం లేదో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+