కేసీఆర్ అలా చేసినా, జైలుకెళ్లక పోవడం చంద్రబాబుకే సాధ్యం: జగన్
కృష్ణా, గోదావరి నది జలాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంటే సీఎం చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారని వైసిపి అధినేత జగన్ ఆదివారం మండిపడ్డారు. కోటగిరి శ్రీధర్ వైసిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ద్వారకా తిరుమల: కృష్ణా, గోదావరి నది జలాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంటే సీఎం చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారని వైసిపి అధినేత జగన్ ఆదివారం మండిపడ్డారు. కోటగిరి శ్రీధర్ వైసిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
టిడిపి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆరోగ్యశ్రీ, 108 సేవలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయిమంబర్సుమెంట్స్ అమలు కావడం లేదన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను అటు నుంచి అటే పైపులతో తీసుకెళ్లినా అడగడలేడని, అడిగితే ఓటుకు నోటు కేసులో కేసీఆర్ బొక్కలో పెడతాడని భయపడి అడగడం లేదన్నారు.
ఏ భూములను వదిలి పెట్టట్లేదు
చంద్రబాబు ఏ భూములను వదిలి పెట్టడం లేదని జగన్ అన్నారు. నచ్చిన వాళ్లు అడిగితే కనకదుర్గమ్మ భూములను కూడా ఇచ్చేస్తారని ఆరోపించారు. అమరావతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే అన్నారు. అభివృద్ధఇ పేరుతో కాంట్రాక్టర్లకు కోట్లు కట్టబెడుతున్నారన్నారు. రైతుల భూములు ఎలా లాక్కోవాలా అని కేబినెట్లో చర్చిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు. బలవంతంగా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు చెప్పినట్లుగా పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిసే రోజు తొందరలో ఉందన్నారు.

కోటగిరి శ్రీధర్‌ను ఆహ్వానిస్తున్నా..
వైసిపిలోకి కోటగిరి శ్రీధర్‌ను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన శ్రీధర్ ప్రజలకు మంచి చేయాలనో ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. మంచి చేస్తాడనే తనకు నమ్మకం ఉందన్నారు.
అడ్డంగా దొరిగినా చంద్రబాబు జైలుకెళ్లలేదు
రాష్ట్రం వైపు ఓసారి తిరిగి చూస్తే చంద్రబాబు పరిపాలన కనిపిస్తుందన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ వన్‌గా ఉందన్నారు. సూటుకేసుల్లో బ్లాక్ మనీ తీసుకెళ్లి ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోవడం, జైలుకు వెళ్లకపోవడం ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇది ఒక్క చంద్రబాబు విషయంలోనే జరుగుతోందన్నారు. మోడీని హోదా కోసం గట్టిగా అడిగితే ఏపీలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించి జైల్లో పెడతారనే భయం బాబుకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications