పవన్ ఇరికించారు: 'బాలకృష్ణ-చిరుమాట్లాడరేం, పన్నీరు కంటే చంద్రబాబు దారుణం'
ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేత చిరంజీవి, టిడిపి నేత బాలకృష్ణలు ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సమితి ఆదివారం విమర్శించింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేత చిరంజీవి, టిడిపి నేత బాలకృష్ణలు ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సమితి ఆదివారం విమర్శించింది.
ప్రజాప్రతినిధులుగా ఉన్న బాలయ్య, చిరులు హోదా అంశం పైన ఎందుకు మాట్లాడం లేదో చెప్పాలని నిలదీసింది. తమిళనాడు స్ఫూర్తితో హోదా కోసం సినీ పరిశ్రమ మద్దతు తెలపాలని కోరింది. హోదా ఉద్యమంలో అందరు పాల్గొనాలన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏపీకి ఒక్క పైసా తేలేదని, అజ్ఞానంలో ఉన్న వారు మాత్రమే ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారన్నారు. అధికార పక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాలు చేస్తే తప్ప హోదా రాదన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం కంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి మరీ దారుణంగా, అధ్వాన్నంగా ఉందన్నారు.
జల్లికట్టును పట్టుబట్టి పన్నీరు సెల్వం సాధించారని, అదే తరహాలో హోదా సాధించేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. కాగా, హోదా పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. ఆయన బాలకృష్ణ, చిరంజీవిలను ఇరుకున పెట్టేలా చేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications