బీజేపీతో 'బిగ్ డ్యామేజ్' తప్పదనే?: నంద్యాలపై ఆ పార్టీ మౌనం వెనుక.. బాబు ప్లాన్?

Subscribe to Oneindia Telugu

కర్నూల్: నంద్యాల ఉపఎన్నిక ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. రెండు ప్రధాన పార్టీలు గెలుపు మాదంటే మాదని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల్లోని ప్రధాన నేతలంతా అక్కడే పాగా వేసి మరీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

జగన్ స్వయంకృతాపరాధం?: చేజేతులా టీడీపికి కొత్త 'అస్త్రం', వ్యూహం మార్చిన ప్రత్యర్థి?

మొత్తం మీద తమ పూర్తి బలాన్ని ఉపయోగించి నంద్యాలలో నెగ్గుకురావాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ తమ మిత్రపక్షమైన బీజేపీని పక్కనబెట్టడం కాస్త ఆలోచించాల్సిన అంశం. బీజేపీని రంగంలోకి దించితే అది తమకు మైనసే అవుతుంది తప్ప ఏమాత్రం దోహదపడదని టీడీపీ ఆలోచించిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే నంద్యాల ఉపఎన్నికలో బీజేపీ ఊసు లేకుండానే టీడీపీ నెట్టుకొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?

బీజేపీ ఎందుకు మైనస్?:

బీజేపీ ఎందుకు మైనస్?:

నంద్యాలలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. ఇక్కడ దళితులు, ముస్లింల ఓటు బ్యాంకే ప్రధానం. ఈ రెండు సామాజికవర్గాల్లోను బీజేపీకి వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దోస్తీ కట్టి ప్రచారానికి వెళ్తే.. అసలు ఎసరొస్తుందని చంద్రబాబు భావించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఉపఎన్నికలో బీజేపీని టీడీపీ పూర్తిగా దూరం పెట్టేసిందన్న చర్చ జరుగుతోంది.

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal by-polls
బీజేపీనే దూరం అవుతోందా?:

బీజేపీనే దూరం అవుతోందా?:

బీజేపీని టీడీపీ దూరం పెడుతుందా?.. లేక బీజేపీయే దూరంగా జరుగుతోందా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల పరిణామాలను గమనిస్తే.. జగన్ బీజేపీ హైకమాండ్‌కు దగ్గరవుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి.

ఊహించని విధంగా జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీయేకు జగన్ మద్దతు తెలపడం, ఆపై రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు జగన్ పాదాభివందనం చేయడం వంటి పరిణామాలు బీజేపీ-వైసీపీ మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంటే, టీడీపీతో దూరం జరగడానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

మరో విషయమేంటంటే?

మరో విషయమేంటంటే?

వెంకయ్యను సైతం క్రియాశీలక రాజకీయాల నుంచి పక్కకు తప్పించడం.. సీట్ల పెంపుపై ప్రతికూలంగా వ్యవహరించడం వంటి విషయాలు కూడా టీడీపీకి బీజేపీ పొగ పెడుతుందన్న సంకేతాలను పంపించినట్లయింది. దీంతో రెండు పార్టీల మధ్య ప్రస్తుతం బలవంతపు కాపురమే సాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి బలం చేకూరుస్తూ ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికలో అసలు బీజేపీ ఊసే లేకుండా టీడీపీ పనికానిచ్చేస్తోంది.

'బిగ్ డ్యామేజ్' తప్పించడానికే?:

'బిగ్ డ్యామేజ్' తప్పించడానికే?:

బీజేపీని నంద్యాల ప్రచారంలో దించడం ప్రత్యర్థి పార్టీకి మేలు చేస్తుందన్న అభిప్రాయంతోనే టీడీపీ ఆ పార్టీని దూరం పెట్టిందన్న వాదన కూడా ఉంది. బీజేపీ మీద వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారితే 'బిగ్ డ్యామేజ్' తప్పదు కాబట్టి.. ఎందుకొచ్చిన తలనొప్పి అని చంద్రబాబు భావించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ సైతం ఎన్నికలపై మౌనం వహిస్తుండటం, నామమాత్రంగానైనా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఎన్నికలు పూర్తయ్యేదాకా ఇదే పరిస్థితి ఉంటుందా? అన్నది వేచిచూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Surprisingly, there has not been any statement from Bharatiya Janata Party so far regarding nandyala bypoll. Since it is a political ally of the TDP, one would expect that it would support Brahmanand Reddy. But the BJP has not come out with any statement supporting the TDP candidate till now, at least for the sake of alliance.
Please Wait while comments are loading...