అసెంబ్లీలో గుట్టంతా విప్పుతా: చంద్రబాబు వ్యాఖ్య

కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం అనైతిక విధానాలతో రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగ సంప్రదాయాలు, ఆచారాలను ఉల్లంఘిస్తోందన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఏమైందన్నారు. దీనికోసం అన్నా హజారే రావాలేమో అన్నారు. మహిళా బిల్లు కోసం రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు.
మరోవైపు రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో మంగళవారం కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. విశాఖ నగరంలో ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి మద్దిలపాలెం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తా రోకో, మానవహారం జరిపారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరై సీమాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. ఎపిఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొవ్వొత్తులతో ఊరేగింపు నిర్వహించి తరువాత దహన సంస్కారం చేపట్టారు.












Click it and Unblock the Notifications