వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎంవో నేరస్తులకు గస్తీనా, కాపురం పెట్టండి: విజయసాయి-మోడీలపై బాబు సంచలనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఒక అవినీతిపరుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే ఎలా అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన మండలిలో గురువారం అన్నారు. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి పీఎంవోలో కనిపించాయనే వార్తలపై ఆయన పదేపదే విమర్శలు చేస్తున్నారు.

Recommended Video

పవన్ అవగాహనా లేకుండా మాట్లాడ్తున్నాడు

తనను బోను ఎక్కించేంత వరకు పీఎంవోలోనే ఉంటానని విజయ సాయి రెడ్డి చెబితే మీకు బాధగా అనిపించలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన వద్దకు నేరస్తులు ఎవరైనా రాగలుగుతున్నారా అని ప్రశ్నించారు. పీఎంవోకు నేరస్తులు రాకూడదన్నారు. అవినీతిపరులను పీఎంవో చుట్టు తిప్పుకోవడమే కాదని, కాపురాలు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు.

మోడీ పారిపోతున్నారని నేను అనను!: మోడీ ప్రభుత్వంపై టీడీపీ అలా, సుజన ఇలామోడీ పారిపోతున్నారని నేను అనను!: మోడీ ప్రభుత్వంపై టీడీపీ అలా, సుజన ఇలా

 పీఎంవోలో కూర్చోవడం కాదు.. కాపురాలు పెట్టుకోండి

పీఎంవోలో కూర్చోవడం కాదు.. కాపురాలు పెట్టుకోండి

బీజేపీ చవకబారు రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ నేరస్తుడు సీబీఐ డైరెక్టర్‌ను కలిస్తే కేసు పెట్టారని వ్యాఖ్యానించారు. నేరస్తులకు పీఎంవో ఆఫీసు గస్తీ కానున్నదా అని నిలదీశారు. పీఎంవోలో కూర్చోవడం కాదు.. కాపురాలు పెట్టుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను టెక్నికల్‌గా, లీగల్‌గా ఎక్కడా తప్పు చేయలేదు

తాను టెక్నికల్‌గా, లీగల్‌గా ఎక్కడా తప్పు చేయలేదు

తాను టెక్నికల్‌గా, లీగల్‌గా ఎక్కడా తప్పు చేయలేదని చంద్రబాబు అన్నారు. తాను ఎక్కడా లాలూచీ పడలేదన్నారు. తాను అవినీతిని ఉపేక్షించన్నారు. దేశ బడ్జెట్ డబ్బు మనకు ఇవ్వాలని అడిగామా అని ప్రశ్నించారు. పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు. 11 జాతీయ ప్రాజెక్టుల్లో పనులే ప్రారంభం కాలేదన్నారు. ప్రాజెక్టులపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.

విజయసాయి రెడ్డి దాగుడుమూతలు ఎందుకు

విజయసాయి రెడ్డి దాగుడుమూతలు ఎందుకు

పీఎంవోలో విజయసాయి రెడ్డి దాగుడు మూతలు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తుడికి పీఎంవోలో ఏం పని అని అడిగారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము కోరుతున్నామని చెప్పారు. నేను విభజన చట్టం హామీలు అడిగితే, మేం చాలా ఇచ్చామని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీల అభ్యంతరం, ఆగ్రహం

చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీల అభ్యంతరం, ఆగ్రహం

చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. నదలను అనుసంధానం చేయాలని నాడు వాజపేయికి తానే చెప్పానని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నీళ్లను అనుసంధానం చేశామని చెప్పారు. బీజేపీతో తాము అప్పుడు కలిసింది, ఇప్పుడు విడిపోయింది ఏపీ ప్రయోజనాల కోసమేనని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Thursday questioned why YSRCP MP VIjaya Sai Reddy having such easy access to PMO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X