జగన్ దీక్ష ఎందుకో: దానం, ప్రధానితో కేంద్రమంత్రుల భేటీ

ఆయన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలహీన వర్గాలకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గతంలోని తాము అధిష్టానానికి చెప్పామన్నారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర ప్రజలను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దానం సీమాంధ్ర ఉద్యకారులను హెచ్చరించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పైన, ఆస్తుల పైన దాడులకు దిగడం సరికాదన్నారు.
ప్రధానితో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, పళ్లం రాజు, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కావూరి సాంబశివ రావు పాల్గొన్నారు. భేటీలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు. వారు సీమాంధ్ర తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications