చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్- ఆయనకు ఇష్టం లేదా?
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుప్పం పర్యటనలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో- ఆయనను పరామర్శించడానికే పవన్ కల్యాణ్ ఆయన ఇంటి గడప తొక్కారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

పొత్తుల దిశగా మలి అడుగు..
తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య ఇక పొత్తులు లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తుల దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను మొన్నటివరకు పెద్దగా పట్టించుకోలేదు పవన్. ఇప్పుడా పరిస్థితి లేనట్టే.

జీవో నంబర్ 1
కారణం ఏదైనప్పటికీ- చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లడం అనేది పొత్తుల సంకేతాలుగానే భావించాల్సి వస్తోందనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీమంత్రులు ఈ భేటీని తప్పుపట్టినప్పటికీ- ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోనట్టే కనిపిస్తోన్నారు ఆ ఇద్దరూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మహాకూటమిగా ఆవిర్భవించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సీట్ల పంపకాలపై స్పష్టత
చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ఈ దిశగా త్వరలోనే ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయనీ చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, అయిదు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

నాదెండ్ల డుమ్మా..
ఈ భేటీకి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో కలవడానికి ఆయన రాలేదు. ఎప్పుడూ పవన్ కల్యాణ్ వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్- కీలకమైన చంద్రబాబుతో భేటీకి ఎందుకు గైర్హాజర్ అయ్యారనేది చర్చనీయాంశమౌతోంది. చంద్రబాబుతో పొత్తు ఆయనకు ఇష్టం లేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నప్పటికీ- అది కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తోన్నాయి.

పవన్‌ను చంద్రబాబు పరామర్శించినప్పుడూ..
ఇదివరకు పవన్ కల్యాణ్ ను పరామర్శించడానికి చంద్రబాబు విజయవాడ నొవాటెల్ హోటల్ కు వచ్చినప్పుడూ నాదెండ్ల మనోహర్ అక్కడే ఉన్నారు. చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిందీ ఆయనే. జనసేనలో చేరినప్పటి నుంచీ పవన్ కల్యాణ్ వెంటే ఉంటోన్నారాయన. కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్నారు. ఈ మధ్యకాలంలో పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడినప్పటికీ- ఆయన మాత్రం అందుకు ఇష్టపడలేదు.

అక్కడ తీరిక లేకుండా..
ప్రస్తుతం జనసేన పార్టీ ఈ నెల 12వ తేదీన శ్రీకాకళం జిల్లాలోని రణస్థలం మండలం తాళ్లవలసలో యువ శక్తి పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారని, అందుకే ఆయన హైదరాబాద్ కు రాలేకపోయారని చెబుతున్నారు. చంద్రబాబుతో భేటీకి ముందు- ఆ తరువాతా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, చర్చకు వచ్చిన అంశాల గురించి నాదెండ్ల మనోహర్ ఆరా తీశారని పార్టీ నాయకులు వివరణ ఇస్తోన్నారు.
-
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్-కేబినెట్లో మంత్రులతో సీఎం..! -
సాయిరెడ్డి సంచలన ప్రకటన, టార్గెట్ ఫిక్స్..!! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications