నంద్యాలలో కదిరి బాబురావు ఇష్యూ: ఆ రోజు ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలల్లో స్క్రుటినీ సమయంలో టిడిపి, వైసిపిలు పరస్పరం అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేవని ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రధానంగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ అంశంలో కదిరి బాబురావు పేరు వినిపించింది.

కదిరి బాబురావులా శిల్పాకు షాక్ తగులుతుందా? నామినేషన్ చెల్లుతుందా, ఏవరి వాదన ఏమిటి, ఏం జరిగింది?

సంతకం చేయడం మరిచారు

సంతకం చేయడం మరిచారు

దీంతో ఆ రోజు ఏం జరిగిందనే ఆసక్తి అందరిలోను నెలకొంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి టిడిపి అభ్యర్థిగా కదిరి బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేయడం మరిచారని తెలుస్తోంది.

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు

ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు

దీంతో బాబురావు నామినేషన్ చెల్లుబాటు కాలేదని చెబుతున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉగ్రనరసింహా రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు.

అపిడవిట్లో సంతకం చేయని కారణంగా

అపిడవిట్లో సంతకం చేయని కారణంగా

నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో కదిరి బాబురావు సంతకం చేయని కారణంగా నాడు నామినేషన్ తిరస్కరించారు. ఇక్కడ ఆ రోజు డమ్మీగా ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతిచ్చారు.

వేర్వేరుగానే కానీ

వేర్వేరుగానే కానీ

కానీ, ఇప్పుడు నంద్యాల ఎన్నికల్లో అంశం వేరుగా కనిపిస్తోంది. ఆ రోజు అఫిడవిట్ పత్రాలపై కదిరి బాబురావు సంతకం చేయలేదు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి అఫిడవిట్లో నోటరీ రెన్యువల్ కాలేదు. నోటరీ రెన్యూవల్ కాని నేపథ్యంలో శిల్పా నామినేషన్‌పై ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why Telugu Desam Party leader Kadiri Babu Rao's nomination rejected in 2009 general elections from Kanigir.
Please Wait while comments are loading...