పవన్ కళ్యాణ్ మాట, రజనీ మనసులో మాట!: కానీ, చిరంజీవిని లాగి పొరపాటు చేశారా?
హైదరాబాద్/అమరావతి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఆయన నిర్ణయం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన మాటలను బట్టి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనిపిస్తోందని అంటున్నారు.
చదవండి: రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా! దానికి జనసేనాని ఫుల్‌స్టాప్
లేదంటే అడిగినప్పుడే కొట్టి పారవేసేవారని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వస్తే కొత్ పార్టీ పెడతారా లేక ఇతర పార్టీలలో చేరుతారా అదీ కాదంటే పార్టీ పెట్టి ఇతర పార్టీలతో జత కడతారా అనే అంశం పైనా చర్చ సాగుతోంది. వస్తే కనుక కొత్త పార్టీ పెట్టడానికే అవకాశముందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: తోడుదొంగలు గేమ్ బాగా ఆడుతున్నారు: పవన్-బాబులపై కత్తి మహేష్ సంచలనం, 'అంత మాటా!'

రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే, కనుక ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ తేడా ప్రస్తుతానికి అయితే కనిపిస్తోందని అంటున్నారు. యుద్ధంలోకి దిగితే గెలుపే లక్ష్యం కావాలని, యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే చాలదని, వ్యూహం ఉండాలన్నారు. తద్వారా వాపు ఉంటే సరిపోదని, ప్రజా బలం, వ్యూహాలు ఉండాలని భావిస్తున్నారు. గెలుపు అంటే ఆయన ఉద్దేశ్యం అధికారం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిభాషలో గెలుపు అంటే దాదాపు అధికారమే!

పవన్ కళ్యాణ్ మాట, రజనీకాంత్ మనసులో మాట
ఎన్నికల్లో గెలవకపోయినా రాజకీయలలో మార్పు తీసుకు రావడం కూడా గెలుపే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. తనకు అధికారం ముఖ్యం కాదని, దానిపై యావ లేదని, ప్రజలకు మంచి జరిగితే చాలని చెబుతున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని అంటున్నారు. యుద్ధంలో గెలుపు అంటే మార్పు.. అధికారంలో ఉండి చేయవచ్చు. లేకుండా చేయవచ్చునని పవన్ భావిస్తున్నారు. రజనీ ఉద్దేశ్యం అలాగే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇరువురు అధికారం కాకుండా యుద్ధం, వీరత్వం, వ్యూహంతో గెలవాలనుకుంటున్నారు.

పవన్ అక్కడే తప్పులో కాలేశారా?
ఇక్కడ మరో చర్చ కూడా సాగుతోంది. రజనీకాంత్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అదే కోరుకుంటున్నారు. కానీ ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరో అర్థానికి దారితీస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఏపీ పర్యనటనలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అది చర్చనీయాంశమైంది.

జనసేన బుద్ధి చెబుతుందని కీలక వ్యాఖ్యలు
ప్రజల కోసం ఆలోచిస్తున్నప్పుడు ఆ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని పలువురు భావించారు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వారు అందరూ తనకు గుర్తున్నారని, చిరంజీవి మంచి చేయాలని పీఆర్పీ పెట్టారని, కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అది నెరవేరలేదని, వారందరూ గుర్తున్నారని, వారికి జనసేన చెప్పుతో కొట్టినట్లు చేస్తుందన్నారు.

పవన్ వ్యాఖ్యలు అలా అర్థం చేసుకోవచ్చుగా
రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలన్నా, ఇతర పార్టీలకు అతీతంగా ఉండాలన్నా ప్రతీకారం తీసుకుంటామన్నట్లుగా మాట్లాడటం సరికాదనే వాదనలు వినిపించాయి. అదే సమయంలో పవన్ వ్యాఖ్యల్లో మరో అర్థం కూడా చూడవచ్చుననే వారు లేకపోలేదు. పీఆర్పీ ఏ మంచి చేయాలనుకుందో, దానినే జనసేన ద్వారా చేసి చెప్పుతో కొట్టినట్లు చేస్తామని చెప్పారని ఎందుకు అనుకోకూడదని అంటున్నారు.












Click it and Unblock the Notifications