వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు కుటుంబాల మధ్య రక్తచరిత్ర, రామసుబ్బారెడ్డి వ్యతిరేకత అందుకేనా?

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కడప జిల్లా నుండి ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కింది.అయితే ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వకూడదంటూ జమ్మలమడుగు టిడిపి ఇన్ చార్జ్ రామసుబ్బారెడ్డ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కడప జిల్లా నుండి ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కింది.అయితే ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వకూడదంటూ జమ్మలమడుగు టిడిపి ఇన్ చార్జ్ రామసుబ్బారెడ్డి తీవ్రంగా అభ్యంతరాలను వ్యక్తం చేశారు.మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబాలకు మద్య రక్తచరిత్ర ఉంది. ఈ రెండు కుటుంబాల మద్య ఏళ్ళ తరబడిగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి.

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఘర్షణలున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన వారు ప్రాణాలను కోల్పోయారు.

తమ తండ్రుల నుండి వారసత్వంగా ఫ్యాక్షన్ ను కూడ ఈ రెండు కుటుంబాలు పొందాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపిలు ఈ రెండు కుటుంబాలుగా విడిపోయాయి. రామసుబ్బారెడ్డి కుటుంబం టిడిపికి, ఆదినారాయణరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండేది.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు.ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టేలా సిఎం రమేష్ వ్యవహరించారని రామసుబ్బారెడ్డి వర్గీయులు చెబుతున్నారు.

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య యుద్దం

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య యుద్దం

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మద్య దశాబ్దాలుగా ప్రత్యక్ష యుద్దం సాగుతోంది.ఆదినారాయణరెడ్డి తండ్రి శంకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రామసుబ్బారెడ్డి చిన్నాన్న శివారెడ్డి టిడిపిలో ఉండేవారు.

ఆదినారాయణరెడ్డి తండ్రి శంకర్ రెడ్డిని ఆయనతో పాటుగా భీమగుండం గోపాల్ రెడ్డిని రామసుబ్బారెడ్డి చిన్నాన్న శివారెడ్డి హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట వద్ద శంకర్ రెడ్డి , గోపాల్ రెడ్డి హత్యకు గురయ్యారు.

 రామసుబ్బారెడ్డి చిన్నాన్న శివారెడ్డి హత్య

రామసుబ్బారెడ్డి చిన్నాన్న శివారెడ్డి హత్య

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణరెడ్డి తండ్రి శంకర్ రెడ్డి , గోపాల్ రెడ్డి హత్యకు ప్రతీకారంగా శివారెడ్డిని హత్యకు గురయ్యారని టిడిపి నాయకులు చెబుతుంటారు.ఈ హత్యలతో ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు ఇంకా పెరిగిపోయింది.రెండు కుటుంబాలకు గ్రూపులు కూడ ఈ నియోజకవర్గంలో అదే తరహలో కొనసాగుతాయి. ఒకరి ముఖం మరోకరు కూడ చూసుకొనే పరిస్థితులు ఉండవని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు.

రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి

రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి

శివారెడ్డి మరణం తర్వాత రామసుబ్బారెడ్డి అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.దీంతో అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన రామసుబ్బారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.అయితే రామసుబ్బారెడ్డిని చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.

శంకర్ రెడ్డి హత్యకేసులో రామసుబ్బారెడ్డి జైలుకు

శంకర్ రెడ్డి హత్యకేసులో రామసుబ్బారెడ్డి జైలుకు

ఆదినారాయణరెడ్డి తండ్రి శంకర్ రెడ్డి హత్యకేసులో మంత్రిగా ఉన్న రామసుబ్బారెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.చంచల్ గూడ జైలులో ఆయన శిక్షను అనుభివించారు.ఈ కేసేు విషయమై రామసుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.

రామసుబ్బారెడ్డి పై ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆధిపత్యం

రామసుబ్బారెడ్డి పై ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆధిపత్యం

జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి పై ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాక రామసుబ్బారెడ్డి వర్గం మరింత ఢీలా పడిపోయింది.

టిడిపిలోకి ఆదినారాయణరెడ్డి

టిడిపిలోకి ఆదినారాయణరెడ్డి

వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోయాయి.అదే సమయంలో జగన్ ఏర్పాటు చేసిన వైసీపిలో ఆదినారాయణరెడ్డి కుటుంబం చేరింది. తర్వాత కొంతకాలంపాటు జగన్ తో ఆదినారాయణరెడ్డి విబేధించి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరసన చేరారు. తర్వాత వైసీపి అధినేతతో ఉన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాది క్రితం వైసీపీని వీడి ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు.

సిఎం రమేష్ వల్లే ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి

సిఎం రమేష్ వల్లే ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి

కడప జిల్లాలో టిడిపిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, జిల్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావులు ప్లాన్ చేశారు.ఈ మేరకు ఆదినారాయణరెడ్డితో చర్చలు జరిపారు. ఆయన కూడ టిడిపిలో చేరారు.

రామసుబ్బారెడ్డి వర్గానికి చేదు అనుభవాలు

రామసుబ్బారెడ్డి వర్గానికి చేదు అనుభవాలు


ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని వీడతానని ప్రకటించారు. అయితే సిఎం రమేష్ , గంటా శ్రీనివాస్ రావులు ఈ విషయమై రామసుబ్బారెడ్డిని బుజ్జగించారు.అయితే ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరడానికి ముందే అదే నియోజకవర్గంలో పర్యటించిన జగన్ ను రామసుబ్బారెడ్డి వర్గీయులు కలవడం చర్చనీయాంశంగా మారింది.మంత్రివర్గంలోకి ఆదినారాయణరెడ్డిని తీసుకోకూడదని కూడ రామసుబ్బారెడ్డి కోరారు.అయినా పట్టించుకోలేదు. రామసుబ్బారెడ్డికి ఆర్ టి సి చైర్మెన్ పదవి ఇస్తామని ప్రతిపాదించారు.అయితే రామసుబ్బారెడ్డి తిరస్కరించారు.

English summary
why Tdp leader Rama subba Reddy opposed minister Adinarayana Reddy, rivalry both families from past 20 years above.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X