మిథున్ రెడ్డి పరామర్శకు జగన్ దూరం, తెర వెనుక..!?
+
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ టార్గెట్ గా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇటు జగన్ సైతం కూటమి ప్రభుత్వం పైన కొత్త వ్యూహాలతో పోరాటం ప్రారంభించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కాగా, పలువురిని పరామర్శించిన జగన్.. మిథున్ రెడ్డి వద్దకు వెళ్లకపోవటం పైన రాజకీయంగా కొత్త చర్చ జరుగుతోంది.
లిక్కర్ కేసులో రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. కాగా, ఈ నెల 5న రాజమండ్రి జైలులో జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని పార్టీ నేతలు చెప్పారు. జగన్ మాత్రం రాజమండ్రి వెళ్లలేదు. డోన్ లో ఆర్దిక మంత్రి బుగ్గన కుమారుడు వివాహ రిసిప్షెన్ కు వెళ్లి అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే, జగన్ రాజమండ్రికి ఎందుకు వెళ్లలేదనేది పార్టీలో చర్చగా మారింది. పలు కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ నేతలను జైలుకు వెళ్లి పరామర్శించారు. మిథున్ రెడ్డిని జగన్ పరామర్శించకపోవటం వెనుక అనేక కొత్త కారణాలు తెర మీదకు వస్తున్నాయి.

జగన్ ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం జగన్ ఇప్పటి వరకు పరామర్శించ లేదు. జగన్ కు నమ్మకంగా పని చేసిన ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరినీ జగన్ ఇప్పటి వరకు పరామర్శించ లేదు. వాస్తవంగా జగన్ ఇప్పటి వరకు పరామర్శించిన నేతలు కంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి తొలి నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అయితే.. జగన్ తొలుత మిథున్ రెడ్డిని కలవాలని భావించినా.. వీరిని ఎవరినీ కలవకుండా నేరుగా మిథున్ రెడ్డిని కలవటం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటం పై జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలు లిక్కర్ కేసు అంతా కల్పితం అని చెబుతున్న జగన్ ఆ కేసులో అరెస్ట్ అయిన వారిని కలవటం లో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం పైన ఇప్పుడు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications