జగన్ Vs పవన్ - సైలెంట్ ఆపరేషన్, కొత్త టర్న్..!!
ఏపీ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. కూటమి వర్సస్ వైసీపీ పొలిటికల్ వార్ రోజు రోజు కీ ముదురుతోంది. జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పైనే జగన్ ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ ను లక్ష్యంగా చేసుకున్న జగన్.. ఇప్పుడు ఎక్కడా పవన్ పేరు ప్రస్తావన చేయటం లేదు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా.. జనసేన నుంచి స్పందన కనిపించటం లేదు. అసలు ఏం జరుగుతోంది.. ఎవరి వ్యూహాలేంటి..
జగన్ లెక్క మారిందా
కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కానుంది. కూటమి ప్రభుత్వంలో చోటు చేసు కొంటున్న పరిణామాల పైన మాజీ సీఎం జగన్ స్పందిస్తున్నారు. విజయవాడలో వరదల నుంచి మొదలైన విమర్శలు.. తాజాగా మిర్చి రైతుల అంశం వరకు సీఎం చంద్రబాబు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం వరకు దత్తపుత్రుడు అని విమర్శించిన జగన్.. ఇప్పుడు ఎక్కడా పవన్ ప్రస్తావన చేయటం లేదు. పవన్ వివాహాల గురించి పదే పదే మాట్లాడిన జగన్ పూర్తిగా పవన్ పేరును తీసుకురాకుండా కేవలం ముఖ్యమంత్రి పైనే రాజకీయం గా గురి పెడుతున్నారు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా కనిపిస్తోంది.

చంద్రబాబు లక్ష్యంగా
జగన్ నేరుగా పవన్ పైన ఎలాంటి విమర్శలు చేయకపోవటంతో ఆ పార్టీ నుంచి జగన్ పైన విమర్శ లు తగ్గాయి. అదే విధంగా చంద్రబాబు లక్ష్యంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా.. జనసేన నుంచి మాత్రం స్పందన కనిపించటం లేదు. ఇక్కడ అసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ పాలన గురించి ఎన్నికల వరకు తీవ్ర విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. టీడీ పీ నేతలు జగన్ విమర్శలను కౌంటర్ చేస్తున్నా.. జనసేన మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. తిరుపతిలో కిరణ్ రాయల్ వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టింగ్స్ చేసినా.. పార్టీ నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదు.
మౌనం వెనుక
ఎన్నికల్లో పవన్ పైన చేసిన వ్యక్తిగత విమర్శల కారణంగా జరిగిన నష్టం వైసీపీ గుర్తించిందనేది మరో విశ్లేషణ. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పవన్ కంటే.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ప్రత్యర్ధిగా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచటం జగన్ వ్యూహం గా స్పష్టం అవుతోంది. కూటమిలో పరిణా మలతోనే జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మౌనం ఆసక్తి కరంగా మారుతోంది. దీంతో, రానున్న రోజుల్లో జగన్ - పవన్ ఇద్దరి రాజకీ యం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications