తాగిన మత్తులో భర్త మర్మాంగం కోసి భార్య దారుణం.. తూర్పు గోదావరి జిల్లాలో ఘటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రఘుదేవపురం గ్రామంలో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తను హత్య చేసిన విషయం ఎవరూ గుర్తించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన మహిళ తన భర్త మూర్ఛ వ్యాధి కారణంగా మరణించాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హతమార్చిన భార్య

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హతమార్చిన భార్య


ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం యానాదుల కాలనీలో మర్రె అబ్బులు, అతనిభార్య ముత్యాలమ్మ నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఇద్దరు మద్యం తాగి ఇంటి వద్ద గొడవ పడ్డారు. ఇక ఇదే సమయంలో ఇద్దరూ గొడవ పడుతూనే ఇంట్లో నుండి బయటకు వెళ్లారు, కానీ ముత్యాలమ్మ మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. ఇక గురువారం ఉదయం రాపాక రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద అబ్బులు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ముత్యాలమ్మ కు సమాచారం అందించారు.

 భర్తకు ఫిట్స్ వచ్చి మరణించినట్టు చిత్రీకరించే యత్నం

భర్తకు ఫిట్స్ వచ్చి మరణించినట్టు చిత్రీకరించే యత్నం


ఇక ముత్యాలమ్మ మృతదేహాన్ని తీసుకు వచ్చి తన భర్త కు ఫిట్స్ వచ్చి మరణించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే అబ్బులు మృతిపై అనుమానంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి అబ్బులు మృతదేహాన్ని పరిశీలించారు. అబ్బులు మర్మాంగం కట్ అయి ఉంది. దీంతో అబ్బులు ఫిట్స్ తో మరణించలేదని,అబ్బులుది హత్య అని గుర్తించారు. ఇక ముత్యాలమ్మ నేరం నుంచి తప్పించుకోవడానికి తన భర్త మూర్ఛ వ్యాధితో చనిపోయాడని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

 కుటుంబ కలహాలే హత్యకు కారణం అంటున్న పోలీసులు

కుటుంబ కలహాలే హత్యకు కారణం అంటున్న పోలీసులు

నార్త్ జోన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించి భార్యే హత్య చేసి ఉంటుందని భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మార‌డంతో తాగిన మైకంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అబ్బులు, ముత్యాలమ్మ దంపతులు గ్రామ శివారుకు వెళ్లారు.

 వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్ తో భర్తను హతమార్చిన భార్య

వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్ తో భర్తను హతమార్చిన భార్య

అక్కడ వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్ తో ముత్యాలమ్మ భర్త అబ్బులును బలంగా కొట్టింది. భర్త మర్మాంగాన్ని కోసింది. ఆపై ఇంటికి వచ్చేసింది. ఇక ఈ విషయాన్ని ముత్యాలమ్మ అంగీకరించడంతో త‌న భ‌ర్తను ముత్యాలమ్మనే హతమార్చింది అని, ఇరువురి మధ్య ఘర్షణలో భర్త హ‌త‌మయ్యాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవ పడి ఏం చేస్తున్నామో అర్ధం కాని పరిస్థితిలో భార్య భర్త ప్రాణాలు తీసింది. ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్న పరిస్థితి సమాజంలో ఆందోళనకరంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+