లోన్ తీసుకొని మోసం చేశాడని భర్తపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్/ఖమ్మం: మోసపూరిత మాటలతో నమ్మించి తన పేరుపై బ్యాంకు రుణం తీసుకున్నాడని ఓ భర్త పైన భార్య ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు అయింది. ఖమ్మంలోని మామిళ్లగూడెంకు చెందిన దివ్యకు హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఉదయ్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది
పెళ్లైన కొన్నాళ్లకు బేగంపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్ తీసుకోవాలంటూ ఉదయ్ దివ్యతో సంతకాలు చేయించుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వారిద్దరూ కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. రుణం చెల్లింపుల పైన ఇటీవల బ్యాంకు నుండి తనకు హెచ్చరికలు అందాయని, తన భర్త మోసపూరిత మాటలతో నమ్మి మోసపోయానంటూ దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం
దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం దిగిన ఆ ప్రయాణికుణ్ణి సోదా చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లారీని ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి
రాజమండ్రి నుంచి గచ్చిబౌలి వస్తూన్న ఓ కారు సోమవారం ఉదయం ఆగిన ఉన్న లారీని ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications